చాలామంది అమ్మాయిలు అందంగా ఉండడానికి ముఖంపైన శ్రద్ద పెడతారే తప్ప చేతులు , కాళ్లపైన ఎటువంటి ఫోకస్ పెట్టరు. ముఖ్యంగా ముఖం అందంగా కనిపిస్తే సరిపోదు కదా.. కాళ్లు , చేతులు కూడా చూడడానికి అందంగా కనిపించిన అప్పుడే మనిషి యొక్క అందం పరిపూర్ణం అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకు కాలి మడమలు పగుళ్ళు భారీగా ఉండడం మనం గమనించవచ్చు. వీళ్లు నచ్చిన చెప్పులు వేసుకోలేక.. నలుగురిలో హుందాగా తిరగలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కాలి పగుళ్ల కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను తీసుకొచ్చి అప్లై చేసినప్పటికీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేక విసుగు చెందుతూ ఉంటారు. అయితే కేవలం ఒకే ఒక్క చిట్కాతో కాలి పగుళ్లు అన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చు.


కాలి పగుళ్లు అనేది ఎందుకు వస్తాయి అంటే ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి శరీరంలో అధికంగా ఉష్ణం ఉండడం వల్ల కాలి మడమల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. కొంతమందికి పొడి గాలి , తేమ సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాదు గట్టి నేల పైన ఎక్కువ సేపు నిలబడటం, మధుమేహం, బిపి , సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి సమస్యల వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. పగిలిన పాదాల ను ఎక్కువగా కేర్ తీసుకోకపోతే సోరియాసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇందుకోసం ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ బంగాళాదుంప రసం, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొంచెం తెలుపు రంగు టూత్ పేస్ట్ తీసుకొని ఆ బౌల్ లో వేసి బాగా కలిపి.. పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మీ ముని వేళ్ళతో మసాజ్ చేసి..కేవలం  15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే కేవలం 4 రోజుల్లో పాదాల పగుళ్లు మాయం అయ్యి మృదువుగా మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: