సాధారణంగా మనం గమనించే విషయం ఏమిటంటే.. కొంతమందికి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి. వీటివల్ల ముఖం ఎంత అందంగా కనిపించినా..ఈ డార్క్ సర్కిల్స్ ముఖ అందాన్ని పాడుచేస్తాయి. కొంతమంది తీసుకొనే ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఫోన్ చూడడం ,ఒత్తిడి , తిరిగే వాతావరణం ,కాలుష్యం, నిద్రలేమి, పోషకాల లోపం ,లాప్టాప్ ఎక్కువగా చూడటం, టీవీ ఎక్కువగా చూడటం వంటి వాటి వల్ల కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా వస్తూ ఉంటాయి.. వీటివల్ల అందం తగ్గించడంతోపాటు వయసు పై బడిన వారిలా కనిపిస్తాయి ఉంటాము.

ముఖ్యంగా కంటి కింద ముడతలు తగ్గి పోవాలి అంటే ఖరీదైన లోషన్లు, క్రీములు కొనుగోలు చేసి మరి వాడుతూ ఉంటారు.. ఇలాంటివి వాడకుండా కేవలం నాచురల్ గా కళ్ళ కింద ఏర్పడిన ముడతలను దూరం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..


పైనాపిల్ ఉపయోగించి కళ్ళకింద ముడతల ను నయం చేయవచ్చు. అదెలాగంటే పైనాపిల్ నుంచి తీసిన రసం తీసుకుని.. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కళ్ళకింద అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు, ముడతలు దూరమవుతాయి.


కీరదోసకాయను ఉపయోగించి కూడా కళ్ల కింద వచ్చిన ముడతలను దూరం చేసుకోవచ్చు.. ఇందుకోసం కీరదోసకాయ పైన ఉండే తొక్క , దాని లోపలి గింజలు తీసేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన కళ్ళు మీ సొంతం అవుతాయి.

కొద్దిగా బాదం నూనె, కొబ్బరి నూనె తీసుకుని బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేస్తూ మెల్లగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే పడుకునే ముందు ఈ పద్ధతి ఆచరించడం తప్పనిసరి.ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే కళ్ళ కింద నల్లటి వలయాలు, ముడతలు తగ్గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: