21 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. విశ్వ వేదికపై భారత కీర్తిపతాకం రెపరెపలాడింది. మిస్ యూనివర్స్ పోటీలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన హార్నాజ్ సందు విజేతగా నిలిచింది. పలువురు సెలబ్రిటీలు హార్నాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అవమానాలు భరించి,యువతకు మనోధైర్యాన్ని ఇచ్చింది. డిప్రెషన్ నుంచి విజేతగా నిలిచి, అందాల పోటీల్లో సత్తా చాటింది. ఇరవై ఒక్క ఏళ్ల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అందాల పోటీలో భారతీయ యువతి విజేతగా నిలిచింది. ప్రపంచ అందాల పోటీలో 80 మంది పోటీదారులను దాటుకొని చివరి రౌండ్లో గెలుపొందింది హర్నాజ్ సందు. భారత్ తరఫున విశ్వసుందరిగా నిలిచిన మూడో యువతిగా రికార్డును సొంతం చేసుకుంది. ఇజ్రాయిల్ లో జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో మొత్తం 80 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ఆ పోటీలో మొదట టాప్ 16 లో చోటు సంపాదించింది. అనంతరం టాప్ 5,టాప్ 3 జాబితాలో చోటు సంపాదించారు. టాప్ 3 లో హర్నాజ్ సందు తో పాటు సౌత్ ఆఫ్రికా అందాలభామలతో గట్టిపోటీ ఎదురైంది.

మిస్ యూనివర్స్ 2021 ఫైనల్ పోటీకి ముందు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు ఇచ్చింది. విశ్వసుందరిగా నిలిచిన  హార్నాజ్ సందు కి భారీగా ప్రైజ్ మనీ దక్కింది. బహుమతులు, స్పాన్సర్ ఇచ్చే గిఫ్ట్ లతో కలిపి విజేతగా హార్నాజ్ మొత్తం రెండు కోట్ల రూపాయల వరకూ సొంతం చేసుకోనున్నారు. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా  భారీగా ఆఫర్లు ఆమె వరించనున్నాయి. విశ్వసుందరి 2021 గా ఎన్నికైన హర్నాజ్ కౌర్ సందు ఈ ఘనత సాధించిన తొలి సిక్కు యువతిగా మరో రికార్డును సాధించింది. అలాగే సుస్మితాసేన్, లారాదత్తా తర్వాత  మూడో భారతీయ సుందరిగా చరిత్రపుటల్లోకి ఎక్కింది. తనకు ఎదురైన అవమానాలు,విమర్శలను మెట్లుగా మార్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చండీగడ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల అందాల సుందరి, 21 సంవత్సరాల తర్వాత భారత్ కు విశ్వ సుందరి కిరీటాన్ని తీసుకొచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె అమ్మే తనకు రోల్ మోడల్ అని అంటారు. మోడలింగ్ కెరియర్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు అమ్మే తనకు దారి చూపిందని,వెన్నుతట్టి ప్రోత్సహించిందని హార్నాజ్ చెబుతారు.హర్నాజ్ కేవలం మోడల్ మాత్రమే కాదు, నటి కూడా. పంజాబ్ లో తెరకెక్కిన పలు సినిమాల్లో నటించారు.

 విద్యార్థి దశలోనే సినిమాల్లో నటించడం పై దృష్టి సారించింది.హార్నాజ్ ముచ్చటగా మూడోసారి దేశానికి కిరీటాన్ని అందించింది. ట్రావెలింగ్ చేయడానికి ఈమె ఎక్కువగా ఇష్టపడతారు. ఏడు దశాబ్దాలుగా మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి. అమెరికన్ భామలు అత్యధికంగా ఎనిమిదిసార్లు టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత స్థానంలో అందగత్తెలకు పుట్టినిల్లు వెనిజ్యుల ఏడు పర్యాయాలు టైటిల్స్ ని  సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: