మన వంటింట్లో దొరికే పదార్థం పసుపు కూడా ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దేశంలో ఈ పసుపును వాడని వారంటూ ఎవరూ ఉండరు. కూరలు చేసేటప్పటికి నుంచి శుభకార్యాల వరకు అన్నిటికీ వాడుతూనే ఉంటారు ఈ పసుపుని. అయితే పసుపు చాలా మేలు చేస్తుందని ఎంతో మంది వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల హానికరం కలుగుతుందని కొంతమంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పసుపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే కలిగే ప్రమాదాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


1).పసుపు అధిక మోతాదులో తీసుకుంటే రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇక ఇలా ఉండడం వల్ల.. ఏదైనా గాయాలు తగిలినప్పుడు ఎక్కువగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది.

2).ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

3). ఇక గర్భిణీలు ఈ పసుపును ఎక్కువగా తీసుకుంటే తల్లి కాకుండా బిడ్డకు కూడా చాలా ప్రమాదమట. గర్భం దాల్చిన తరువాత ఎక్కువగా పసుపును తీసుకుంటే గర్భస్రావానికి చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు.

4). పసుపును అత్యధికంగా తీసుకుంటే.. కడుపు నొప్పి, మంట, కాళ్లు తిమ్మిరి ఎక్కడం వంటివి జరుగుతూ ఉంటాయి.

5). పసుపులో ఉండే ఆక్సలేట్ మూ లకం వలన క్యాల్షియం తగ్గిపోయి.. అవి రాళ్ల గా మారే ప్రమాదం జరుగుతుందట

6). పసుపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు వాంతులు కలిగేలా చేస్తాయి. ఇక అంతే కా కుండా శ్వాస కోస సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువగా వాడకూడదు.

7). చర్మ సౌందర్యానికి పసుపు ఎంతో బాగా పని చేస్తుందో ఎక్కువగా వాడడం వల్ల చర్మంపై దద్దుర్లు రావడం జరుగుతాయట.

8). ఇక ఇదే కాకుండా ముఖ్యంగా చర్మం మీద అలర్జీ వచ్చి.. అందవిహీనంగా కనిపిస్తారు.

అందుచేతనే ఎవరైనా పసుపును ఎక్కువ మోతాదులో వాడుతుంటే.. కాస్త తగ్గించుకుంటే మేలు..

మరింత సమాచారం తెలుసుకోండి: