ఆర్థికంగా మెరుగుపడాలని ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఈ కొత్త ఏడాది కొత్త ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే.. వచ్చే ఏడాది డబ్బు ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు. అది ఎలానో.. ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాము.

ముందుగా ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు రావాలి.. మీ ఆస్తి యొక్క నికర విలువ ఎంత ఉంది..?మీకు వచ్చే నెల వారి సంపాదన ఎంత..? రుణాలు, పొదుపు, నెలవారీ వాయిదాలు, వార్షిక ఆదాయం లో పొదుపు, నెలవారీ ఖర్చు, పిల్లల చదువు, గృహావసరాలు ఇలా మీరు ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడమే కాదు భవిష్యత్తులో సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ ప్రణాళిక సహాయపడుతుంది.

సంవత్సరానికి సరిపడా బడ్జెట్ ను సిద్ధం చేసుకోవాలి.. మీరు రోజువారీ జీవితంలో ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఎంత అవసరాలు ఉన్నాయి.. అనేది విభజించుకోవాలి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. మీకు వచ్చే నెల వారి ఆదాయం లో ఎంత ఆదా చేస్తున్నారో తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది.

మెడికల్ ఎమర్జెన్సీ కోసం అత్యవసర నిధి తప్పనిసరి.. ఆరోగ్య పరిస్థితిని బట్టి.. మెడికల్ బిల్లు కోసం తప్పకుండా కొంత డబ్బును సపరేట్ చేసి పెట్టాలి. ఆ డబ్బు మీకు ఆరు నెలలకు అయ్యే ఖర్చుతో సమానంగా దాచి పెట్టాలి. ప్రస్తుతం ఎన్నో సేవింగ్ స్కీమ్స్ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.. కాబట్టి.. వాటిలో కొంతవరకు దాచుకోవడం ఉత్తమం.

అంతే కాదు జీవిత బీమా కవర్ కూడా తీసుకోవాలి. మీరు పెట్టే ఖర్చులకు అనుగుణంగా జీవిత భీమా కవరేజ్ కనుక తీసుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవు.. ఇక మీకు వచ్చే ఆదాయంలో 30 శాతం పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవవ్వవు.. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఇలాంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆర్థికంగా కొంత డబ్బు వెనక వేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: