న్యూ ఇయర్ అంటే.. ప్రతి ఒక్కరి ఇంట సుఖసంతోషాలు కలగాలని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే అలా ఉండాలంటే.. మన 2022లో కొన్ని ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.

1). కొత్త ఏడాది రోజున మనం ఏదైనా తీర్మానం చేసుకున్నట్లయితే.. వాటిని సఫలం చేసే విధంగా కట్టుబడి ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ ఏడాది అంతా శుభమే కలుగుతుందని కొంతమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.

2). ముఖ్యంగా మన లక్ష్యాలను నిర్దేశించుకునే విధంగా.. ఉత్సాహంగా వాటిని సాధించే క్రమంలో ఉండాలి.. కానీ కొంత మంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అమెరికా లోని కొంతమంది సర్వే చేయగా.. కొత్త సంవత్సరం రోజున లక్ష్యాలను తీర్మానం చేసిన 41% లో కేవలం 9 % మంది మాత్రమే నెరవేర్చినట్లుగా తేలింది. ఇది కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలానే ఉన్నది.

3). ముఖ్యంగా మనం ఏదైనా చేసే పనిలో మన స్నేహితులు, మన భాగస్వామి చెప్పారని కానీ, వారు చేస్తున్నారని కానీ మీ వ్యక్తిత్వ లక్ష్యాన్ని ఎంచుకోకూడదు.

4). మనం ఎన్నో లక్ష్యాలను పెట్టుకున్నప్పటికీ.. వాటిని సహకారం చేసేందుకు చాలా కృషి చేయవలసి ఉంటుంది. కాబట్టి కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే లక్ష్యాలను ఉండేలా చూసుకోవాలి.

5). ఏదైనా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు అయితే వాటికి కావలసిన తగు పరికరాలు మన దగ్గరే ఉండేలా చూసుకోవాలి.

6). మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో వాటిని కేవలం మీకు దగ్గరగా ఉండే వారితోనే పంచుకోవాలి. మీకు అలాంటి వారే.. కొన్ని సలహాలను కూడా ఇవ్వవచ్చు.

7). ఏ విషయంలో నైనా సానుకూల స్వభావం కలిగి ఉండాలి. ఏ రోజు అనుకున్న పని ఆరోజే పూర్తి చేయాలి.నీ కొత్త సంవత్సరం మీరు సంతోషంగా ఆర్థికంగా జీవించాలి అంటే నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: