సాధారణంగా మన ఇంట్లో అనుకోకుండా కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని మనం తేలికగా తీసుకుంటూ వదిలేస్తూ ఉంటాము. అయితే జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది ఏమిటి అంటే.. మన ఇంట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు తలెత్తుతాయి అని హెచ్చరిస్తున్నారు.. ఇవన్నీ వినడానికి మూఢ నమ్మకం గా అనిపించినా చెడు శకునం అనేది పురాతన కాలం నుంచి మనకు వినబడుతూనే ఉంది. మహాభారతం.. రామాయణం వంటి పవిత్ర గ్రంథాలలో కూడా ఈ చెడు శకునం గురించి మాట్లాడిన సందర్భాలు మనం వినే ఉంటాం..

ఇకపోతే ఈ శకునాలను పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయినా సరే నమ్మక తప్పదు.. ఎందుకంటే వారు ఏదైనా కొత్త రంగం ప్రారంభించాలి అనుకున్నప్పుడు తప్పకుండా ముహూర్తాలను చూసుకోని మరీ పూజలు చేయించి.. తమ నూతన వ్యాపార అభివృద్ధికి పునాదులు వేస్తూ ఉంటారు. ఇప్పటికీ మన పెద్దవాళ్ళు ఈ శకునాలను నమ్మడమే కాకుండా ఆచరిస్తారు కూడా.. ఇక ఏమైనా అసంఘటిత కార్యాలు జరిగినప్పుడు అందులో కొన్ని మంచి శకునంగా పరిగణిస్తే , మరికొన్ని అరిష్ట శకునం గా  పరిగణిస్తుంటారు.. అయితే సాధారణంగా మనం మన ఇంట్లో తరచూ చేసే పనులలో కొన్ని పొరపాట్లు దేనికి అదృష్టాన్ని.. దేనికి అరిష్టాన్ని తెచ్చిపెడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


పగిలిన గాజు : ముత్తయిదువు అలంకారం ఈ గాజులు అని చెప్పవచ్చు.. శకునాల ప్రకారం గాజులు పగిలి పోతే అది చెడ్డ శకునం గా భావిస్తారు. అయితే ఎటువంటి లోపాలు లేకుండా హఠాత్తుగా పెరిగిపోయిన సరే కుటుంబంలో అరిష్టం జరగబోతోంది అని పెద్దలు విశ్వసిస్తారు. గాజులు మాత్రమే కాదు గాజు అద్దాలు.. గాజు సామాన్లు పగిలిపోయినా ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో తెలియక భయపడిపోతారు.  అందుకే ఇలా జరిగినప్పుడు సాయంత్రం పూట లవంగాలు వేసి దీపం వెలిగించి.. భోజనం పెట్టి దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.


పాలు పొంగి పోవడం:
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాలు పొంగించడం ఆనవాయితీ..కానీ వంట చేసేటప్పుడు అదే పాలు పొంగిపోతే.. ఆ పొంగిపోయిన పాలను తాగినా కూడా అశుభం అని కొందరు చెబుతున్నారు..


చీపురు:
చీపురు లక్ష్మీ దేవి స్వరూపం కాబట్టి చీపురు పై మహిళలు లేదా ఆ ఇంటికి పెద్దలు అడుగు పెట్టకూడదు అని చెబుతారు. అంతేకాదు సూర్యాస్తమయం సమయంలో కూడా ఇంటి నుండి చెత్త ను తొలగించడం కూడా అశుభం అట..అందుకే  ఎవరికీ కనిపించని ప్రదేశంలో చీపుర్లు ఉంచాలని చెబుతారు.


వీటితోపాటు బయటకు వెళ్లేటప్పుడు తుమ్మడం, కుక్క, పిల్లి వంటి జంతువుల ఏడుపు కూడా అరిష్టానికి సంకేతం అని పెద్దలు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: