మన వంటింట్లో దొరికే ఉల్లిపాయలు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవి మంచి రుచిని ఇవ్వడంతోపాటు.. బోలెడన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందుచేతనే ప్రతి ఒక్కరూ ఇంట్లో వీటిని తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువమంది ఎర్ర ఉల్లి గడ్డలను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక తెల్ల ఉల్లిగడ్డలు రుచిగా ఉండవని వాటిని తక్కువగా తీసుకుంటారు. కానీ చూడడానికి కలర్ లో తేడా ఉన్నప్పటికీ తెల్ల ఉల్లి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు గురించి తెలుసుకుందాం.

1). తెల్ల ఉల్లి గడ్డ లో ఉండే ఫైటోన్యూట్రిమెంట్లు శరీరంలోని ఉండే అలర్జీని తరిమేస్తాయి.ఫలితంగా చలికాలంలో మొదలయ్యే జలుబు, దగ్గు ,ఫ్లూ వంటి సమస్యల నుంచి ఈ తెల్ల ఉల్లిపాయ మనలను కాపాడుతుంది.

2). ఇక తెల్ల ఉల్లిపాయ లో ఉండే ప్రోబయోటిక్స్ మూలకాలు అలాగే ఫైబర్ కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిపాయలలో ఉండే ఇన్సులిన్, ప్రోబయోటిక్ వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెరిగి చెడు బ్యాక్టీరియా ను పూర్తిగా నాశనం చేస్తుంది.. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3). ప్రస్తుతం ఈ కరోనా కాలంలో మన శరీరానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. అందుకే ఉల్లిపాయలో ఉండే సెలీనియం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఉల్లిపాయను తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా పదిలంగా ఉంటుంది.

4). ముఖ్యంగా తెల్ల ఉల్లిపాయలలో క్యాన్సర్ ను అంతం చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ వంటివి ఉన్నాయి. ఇక వీటితో పాటు ఫిసేటిన్ వంటి పోషకాలు లభించడం వల్ల శరీరంలో ఎలాంటి కణితి పెరగకుండా మనకు సహాయపడతాయి.అందుకే ఎవరైనా సరే క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా  ఈ తెల్ల ఉల్లిపాయలను తీసుకునే ఆహారంలో జోడించాలి.

ఈ వైరస్ కాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే తప్పకుండా ఈ తెల్ల ఉల్లిపాయలను ఆహారంలో చేర్చుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: