కరోనాకు రక్ష రెండే రెండు.. ఒకటి టీకా.. మరొకటి మాస్కు.. ఇది ప్రభుత్వాలు ఎప్పటి నుంచో చెబుతున్న మాట.. అందుకే ఇండియాలో టీకాలు చాలా వేగంగా ఇచ్చారు. 140 కోట్ల మంది జనాభా ఉన్నా.. టీకాలు తయారు చేసే సంస్థలు రెండే ఉన్నా.. వీలైనంత త్వరగా అందరికీ టీకాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ టీకాలు తీసుకున్న ధైర్యంతోనే చాలా మంది కరోనా అంటే భయం లేకుండా ఉన్నారు. అయితే.. ఇప్పుడు అలాంటి వారికి భయం పుట్టించే వార్త ఒకటి వచ్చింది.


అదేంటంటే.. కరోనా టీకా తీసుకున్న తర్వాత ఆరు నెలల్లో 30 శాతం మందిలో యాంటీబాడీలు క్రమంగా తగ్గుతున్నాయట. అసలు టీకా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.. టీకా రూపంలో మనలో కరోనా వైరస్‌ను ప్రవేశ పెడతారు. నిజంగా మనకు కరోనా వచ్చిందేమోనని మన శరీరంలోని యాంటీబాడీలు డెవలప్ అవుతాయన్నమాట. అవి నిజంగా కరోనా వచ్చినప్పడు వైరస్‌ను అడ్డుకుంటాయన్నమాట. అయితే.. ఇలా టీకాలు తీసుకోవడం ద్వారా వచ్చిన యాంటీ బాడీలు త్వరలోనే తగ్గిపోతున్నాయట.


టీకా ద్వారా వచ్చిన ఐజీజీ యాంటీ-ఎస్‌1, ఐజీజీ యాంటీ-ఎస్‌2 యాంటీ బాడీల్లో ఈ మేరకు గణనీయమైన మార్పు వచ్చిందట. ప్రత్యేకించి 40 ఏళ్లు దాటి సుగర్, హై బీపీ  ఉన్నవారిలో ఈ యాంటీ బాడీల తగ్గుదల ఎక్కువగా కనిపిస్తోందట. హైదరాబాద్‌లోని ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ చేసిన స్డడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయట.


దాదాపు 1636 మంది కార్యకర్తలపై ఈ ప్రయోగం చేశారట. వీరు టీకా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత వీరిలోని ఐజీజీ-ఎస్‌1, ఎస్‌2 యాంటీబాడీల స్థాయిలను అంచనా వేశారు. ఈ ఆరోగ్య కార్యకర్తల్లో 30 శాతం మందిలో 100 ఏయూ/ఎంఎల్‌ కంటే తక్కువ రేంజ్‌లో యాంటీబాడీలున్నాయట. అయితే.. వీరంతా 40ఏళ్లు వయస్సు దాటిన వారే కావడం విశేషం. అందులోనూ వీరికి హైబీపీ, సుగర్ అన్నాయి. అందుకే అనుబంధ రోగాలు ఉంటే.. రెండు టీకా  డోసులు తీసుకున్నా..  ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: