గతంలో ఎవరైనా రెస్టారెంట్ కి వెళ్లాలంటే అక్కడ ఫుడ్డు ఎలా ఉందో ఎంక్వయిరీ చేసుకొని వెళ్లేవారు. ఇప్పుడు ఫుడ్డుతో పాటు అక్కడ ఆంబియన్స్ ఎలా ఉంటుందో చూస్తున్నారు. ఇలా లుక్ ను కోరుకునే వారి కోసం ఓ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. పాత తరం నాటి ఆటోమొబైల్ వాహనాలను రెస్టారెంట్ల ముందు ఉంచి అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఎల్బినగర్ నుంచి ఉప్పల్ రూట్ లో వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినా, నలుగురు ఫ్రెండ్స్ ఒకేచోట కలిసిన బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ముఖ్యంగా రెస్టారెంట్ కు వెళ్లాలను కుంటారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు హైదరాబా దులోని రెస్టారెంట్ లో సరికొత్త ప్రయోగం చేస్తున్నాయి.

నగరవ్యాప్తంగా డ్రైవ్-ఇన్ కాన్సెప్ట్ తో ఆహర ప్రియులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. హైదరాబాదులోని పలు డ్రైవ్ ఇన్ లు టేస్టీ ఫుడ్ తో స్పెషల్ ఆంబియన్స్ ఏర్పాటుపై దృష్టిపెట్టారు. సరికొత్త కాన్సెప్ట్ లతో ఫుడీస్ కు ఆహ్వానం పలుకుతోంది నగరంలోని ఓ హోటల్. స్కాప్ లో వేసిన ఆటోలు, లారీలను తీసుకువచ్చి ఇలా రెస్టారెంట్ ముందు ఉంచి కస్టమర్లకు ఆహ్వానం పలుకుతున్నారు.

ఇలా కొత్త కాన్సెప్ట్ లో ఓ పాడైపోయిన ఆటో, పాతకాలంనాటి లారీని డ్రైవ్ ఇన్ ఎంట్రెన్స్ బయటపెడుతున్నారు. వాటి లోపల కూర్చుని తినే అవకాశం కల్పిస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కస్టమర్లకు పాతరోజుల్లో వాడిన స్కూటర్ ఒకటి దర్శనమిస్తుంది. ఎప్పుడు హైఫై బండ్లు వచ్చినప్పటికీ ఈ పాత బండ్ల మీద కూర్చుని తినే అవకాశం రావడంతో ఫుడీస్ పాత తరం గుర్తులను నెమరు వేసుకుంటున్నారు. ఇలా పాత స్కూటర్, ఆటో, లారీ కాన్సెప్ట్ బాగా నచ్చాయని చెబుతున్నారు కస్టమర్లు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వెల్ కమ్ చెబుతున్న రెస్టారెంట్ల పట్ల నగర జనం ఆకర్షితులవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: