మైదానంలో బిడ్డ‌లు వినువీధుల్లో బిడ్డ‌లు రాత్రి వేళ‌ల్లో ఉద్యోగం చేసి ఇంటికి వ‌చ్చే బిడ్డ‌లు.. ఎక్క‌డో చ‌దివేను ఎగ‌ర‌డం స్వేచ్ఛ .. ఎద‌గ‌నివ్వ‌డం బాధ్య‌త అని! ఆహా! బిడ్డ‌లంతా ఇటువంటి గొప్ప క్ష‌ణాల‌కు ప్ర‌తినిధులు అయి ఉంటే ఆనందిస్తాను. వారిని క‌న్నీరు ద‌రిచేర‌నివ్వకుంటే చాలు మంచి ఫ‌లితాలు వారే సాధిస్తారు. మ‌నం ప్రేక్ష‌కులం మాత్రమే ఆయా సంద‌ర్భాల్లో!



ఆట స్థలంలో ఆడ‌బిడ్డ‌ల ఆనందం చూసి పొంగిపోవాలి..ఆట‌ల్లోనూ పాట‌ల్లోనూ అమ్మాయిల గెలుపు చూసి గ‌ర్వించాలి. విశ్వ వీధుల‌లో అమ్మాయిలు గెలిచి వ‌స్తే మ‌నం ఆనందం పొందాలి.అవును! మ‌నం ఎక్క‌డో ద‌గ్గ‌ర ఆగిపోయి వారి విజ‌యాన్ని ఆస్వాదించ‌డం  మొద‌లిడితే శ‌క్తిమంతం అయిన స్వ‌రూపాలు అన్నీ మ‌న‌ల్ని దీవించి వెళ్తాయి. ఆ విధంగా బిడ్డ‌ల ఉన్న‌తి మ‌రియు ప్ర‌గ‌తి అన్న‌వి ఈ దేశానికి ఓ గొప్ప అవ‌స‌రం. అవ‌స‌రం ను గుర్తించ‌డం బాధ్య‌త. నెర‌వేర్చ‌డం క‌ర్త‌వ్యం.బిడ్డ‌ల ఉన్న‌తి అన్న‌ది ఇవాళ క‌ర్త‌వ్యం. నేను ఆడ‌పిల్ల‌ను అని ఆగిపోవ‌డం కాదు నేను ఆడ‌పిల్ల‌ను మ‌రియు శ‌క్తిశాలిని అని చెప్ప‌డమే ఇవాళ ఓ ఆవ‌శ్య‌కం కావాలి. బాలికా దినోత్స‌వాన బిడ్డ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు.


పిల్ల‌లూ పెద్ద‌లూ అంతా క‌లిసి ఇవాళ హ్యాపీ డాట‌ర్స్ డే అని అంటారు.పిల్లలూ పెద్ద‌లూ అంతా క‌లిసి ఇవాళ కూతుళ్ల‌కు పెద్ద పండుగ ఒక‌టి చేస్తారు.బిడ్డ‌ల‌ను ప్రేమ‌తో ద‌గ్గ‌ర చేసుకోవ‌డం కూడా పండ‌గే క‌దా! క‌నుక ఇవాళ ప్రేమ మ‌రియు ఆద‌రం నిండిన క‌ళ్ల‌తో బిడ్డ‌ల‌ను పొత్తిళ్ల‌లో తీసుకునే అమ్మ‌ల‌కూ, ప్రేమ‌తో ఆద‌రంతో మ‌రింత ర‌క్ష‌ణ‌గా నిలిచే నాన్న‌ల‌కు కూడా మ‌నం శుభాకాంక్ష‌లు చెప్పి రావాలి. ఆడ‌బిడ్డ‌ల చ‌దువు, స్వేచ్ఛ అన్న‌వి రెండూ రెండు వేర్వేరు దారుల‌లో ఉన్నాయ‌ని,వాటిని మ‌నం అర్థం చేసుకోవ‌డం క‌ష్టం అని అంటారే! అవ‌న్నీ నిజ‌మేనా! లేదా క‌ల్పితాలా? ఊహా సంబంధ వ‌స్తువులను మ‌రియు ప్ర‌తిపాద‌న‌ల‌ను వ‌ద్ద‌నుకుని, వాస్త‌వ రూప జీవితాల‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ విధంగా బిడ్డ‌లంతా ఊహ‌ల‌కు ప్ర‌తిరూపాలు కావొచ్చు కానీ వాస్త‌వంలో వారి స్వేచ్ఛ‌ను, వారి జీవితాశ‌యాల‌ను త‌ప్ప‌క త‌ల్లిదండ్రులు గౌర‌వించాలి.



నేను ఆడ‌పిల్ల‌ను అని గ‌ట్టిగా అరుస్తోంది ప్రియాంక.ఆ విధంగా అర‌వ‌డం ప్రియాంక గాంధీకి అల‌వాటుగా మారిపోయింది.ఆమె ఆడ‌పిల్లే ఎవ‌రు కాద‌న్నారు శ‌క్తిశాలి అయిన ఆడ‌పిల్ల అని నిరూపించుకునేందుకే ఈ ఎన్నిక‌ల యుద్ధం.అవును! బిడ్డ‌లంతా శ‌క్తి శాలులు అని నిరూపించుకోవ‌డం వ‌ల్ల‌నే దేశం వృద్ధికి నోచుకుంటుంద‌ని తెలుసుకోరేం.ఆడ‌బిడ్డ‌ల ప‌రువు,మ‌ర్యాద కాపాడే క్ష‌ణాన అబ్బాయిలు హీరోలు. వాళ్ళే సిస‌లైన హీరోలు. అమ్మాయిల గెలుపునకు స‌హ‌క‌రించే గురువులు, స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉండే స‌మూహాలు కూడా సిస‌లైన హీరోయిజం ఉన్న‌వాళ్లే ! క‌నుక ఆడ‌బిడ్డ‌ల గెలుపు అన్నది వారి వ్య‌క్తిత్వం గెలుపు.. ఈ దేశం ఉన్న‌తి మ‌రియు గెలుపు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి: