సంక్రాంతి త‌రువాత పండ‌గ ఆనందాల‌ను అన్నింటినీ కూడా కరోనా మింగేసింది. ఆ మాట‌కు వ‌స్తే పండుగ రోజుల్లోనూ తీవ్ర జ్వ‌రాల‌రూపంలో ఒమిక్రాన్ వేరియంట్ భ‌యాన్నీ ఆందోళ‌న‌లనూ క‌లిగించింది.ఏవి ఎలా ఉన్నా క‌రోనా ఈ సారి ప్రాణాంత‌క స‌మ‌స్య‌లు అయితే తీసుకుని రాలేదు.అదేరీతిన మెడిక‌ల్ మాఫియా కూడా పెద్ద‌గా సాగ‌లేదు.అంటే క‌రోనా విష‌య‌మై దేవుడు కూడా కాస్తో కూస్తో మ‌న‌వైపే ఉన్నాడు అన్న‌ది తేలిపోయింది.క‌నుక దేవుడికో కృత‌జ్ఞ‌త మ‌రియు ఓ ధ‌న్య‌వాద.అయినా స‌రే! భార‌తీయులూ జాగ్ర‌త్త!



క‌రోనా గురించి భ‌యం వ‌ద్దు ఆందోళ‌న కూడా వ‌ద్దు..మ‌హాన‌గ‌రాల‌ను సైతం వ‌ణికించిన క‌రోనా ఇప్పుడిప్పుడే తోక‌ముడుస్తోంది. ముంబ‌యి, కోల్ క‌తా న‌గరాల్లో ఆర్ వాల్యూ ఒక‌టి క‌న్నా త‌క్కువ‌గా ఉంద‌ని తేలిందని ప్ర‌ధాన మీడియా వివ‌రిస్తోంది.దీంతో క‌రోనా భ‌యాలు మ‌హానగ‌రాల‌కే కాదు మామూలు ప‌ట్ట‌ణాల‌కూ వ‌ద్దే వ‌ద్ద‌ని అధ్య‌య‌నాలు భ‌రోసా ఇస్తున్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ మ‌రో నెల రోజుల పాటు క‌రోనా ఉద్ధృతి పెరిగి మ‌ళ్లీ మామూలు స్థితికి రావ‌డం గ్యారంటీ అని నిపుణులు ప‌క్కాగా చెబుతున్నారు.
అయితే గుంపులు క‌ట్ట‌డం మానుకుని, సంబ‌రాలూ, జాత‌రలూ అంటూ హ‌డావుడి చేయ‌కుండా ఉంటే ఇంకాస్త వేగంగానే వ్యాధి నియంత్ర‌ణ కూడా సాధ్య‌మేన‌ని,అంత బెంబేలెత్తిపోయి ఆర్థికంగా చితికిపోవాల్సిన ప‌ని కూడా ఉండ‌ద‌ని వైద్య వ‌ర్గాలు ఘంటాప‌థంగా చెబుతున్నాయి.

ఇప్పుడంతా క‌రోనా గురించే మాట్లాడుకుంటున్నారు.ఏం మాట్లాడినా ఏం మాట్లాడ‌క‌పోయినా కూడా క‌రోనా గురించి పెద్ద ర‌చ్చ మాత్రం న‌డుస్తోంది.వ్యాపారం,విద్య‌, రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇంకా ఇంకొన్ని భూతాలు ద‌య్యాలు కూడా క‌రోనా రంగంపైనే ఆధార‌ప‌డి ఉన్నాయి.ఇప్పుడున్న సిట్యువేష‌న్ ఇప్ప‌టికిప్పుడు మారిపోతే మాత్రం ఒడ్డెక్కేది సామాన్యుడే! ఆయ‌న‌కు క‌ష్టం రాకుండా ఉన్నంత వ‌ర‌కూ దేశానికి వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు అని ఆర్థిక వేత్త‌లు కూడా చెబుతున్నారు.కనుక సామాన్యుడికి క‌ష్టం రానంత వర‌కూ క‌రోనా విష‌య‌మై,కొత్త వేరియంట్ల విష‌య‌మై కాస్తో కూస్తో అప్ర‌మ‌త్త‌త మాత్రం అవ‌స‌రం అని వైద్య వ‌ర్గాలు చెబుతున్నాయి.వాళ్ల  మాట‌లూ వీళ్ల రాత‌లూ విని హాయిగా ఆందోళ‌న‌లు లేని జీవితాన్ని ఒక‌టి భ‌ద్రంగా గ‌డ‌పండి ప్ర‌జలారా! అని విన్న‌విస్తున్నాయి కొన్నిసానుకూల వ‌ర్గాలు.

వైర‌స్ వ్యాప్తిని సింబ‌లైజ్ చేసే ఆర్ వాల్యూ అన్న‌ది ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది. ఇదొక శుభ‌వార్త. జ‌న‌వ‌రి 14 నుంచి 21 వ‌ర‌కూ ప‌రిశీలిస్తే ఆర్ వాల్యూ 1.57కు త‌గ్గిన‌ట్లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఇది ఇంకా త‌గ్గ‌బోతోంద‌ని,ఒమిక్రాన్ వేరియంట్ తో మ‌రీ అంత ప్ర‌మాద‌మేమీ లేనేలేద‌ని చెబుతున్నాయి వైద్య వ‌ర్గాలు. అయితే ఆర్ వాల్యూ ఒక‌టి క‌న్నా త‌క్కువ ఉంటేనే వ్యాధి త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని వైద్య నిపుణులు ఓ అంచ‌నాకు వ‌స్తాయ‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.క‌నుక కాస్త జాగ్ర‌త్త‌లు పాటించి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ ఉంచుకుని, భౌతిక దూరం పాటిస్తే చాలు ఒమిక్రాన్ ఏమీ చేయ‌దు.అదేవిధంగా చేతుల ప‌రిశుభ్రం మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు మ‌రువ‌ద్దు. ఈ మూడు సూత్రాల‌ను పాటిస్తూ పోతే క‌రోనా నుంచి భార‌తీయ స‌మాజం వేగం వేగంగానే గ‌ట్టెక్క‌వ‌చ్చు.






మరింత సమాచారం తెలుసుకోండి: