చిన్న త‌ప్పు కార‌ణంగా ఓ కంపెనీ దిద్దుబాటుకు పూనిక‌వ‌హించింది.అంత పెద్ద సంస్థ సీఈఓ రంగంలోకి దిగి రైతుకు న‌చ్చ‌జెప్పారు. ఓ దేశం గౌర‌వం ఓ రైతు గౌర‌వం అన్నవి ఓ కంపెనీ న‌డ‌వ‌డిపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని నిరూపించి మ‌హేంద్ర సంస్థ త‌న త‌ప్పును దిద్దుకునేందుకు ఎక్క‌డా వెనుకంజ‌వేయ‌లేదు. ప‌ది రూపాయ‌లు నీ జేబులో ఉన్నాయా నీవు ప‌ది ల‌క్ష‌ల ట్ర‌క్కు కొన‌గల‌వా అని మ‌హేంద్ర షోరూంనకు చెందిన వ్య‌క్తి తన‌ను అవ‌మానించ‌డం ఓ రైతు త‌ట్టుకోలేపోయాడు.అంతే!తానేంటో గంట‌లో నిరూపించాడు.పోలీసు దాకా విష‌యం తీసుకుని వెళ్లాడు. సిబ్బంది తాము చేసిన త‌ప్పిదానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి లిఖిత పూర్వ‌కంగా రాసి ఇచ్చింది. అయినా స‌రే కంపెనీ పెద్ద‌గా ఆనంద్ మ‌హేంద్ర సీన్ లోకి వ‌చ్చారు. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. గొప్ప మ‌న‌సు చాటారు.


దేశం గ‌ర్వించ‌ద‌గ్గ దేశీయ కంపెనీ మ‌హేంద్ర అండ్ మ‌హేంద్ర.ఎంద‌రిలోనో స్ఫూర్తిని నింప‌డం, దేశానికి ప‌నికి వ‌చ్చే,గౌర‌వం పెంచే వ్య‌క్తుల‌ను పిలిచి మ‌రీ గౌర‌వించ‌డం అన్న‌వి ఆ సంస్థ‌కు చాలా అలవాటులో ఉన్న ప‌నులు.ఇటీవ‌ల ఓ త‌ప్పిదం కార‌ణంగా ఆ సంస్థ ప‌రువు పోగొట్టుకుంది.దీంతో సిబ్బందితో పాటు సంస్థ అధినేత కూడా రంగంలోకి దిగారు.గౌర‌వం న‌మ్మ‌కం అన్న‌వి ప్ర‌ధాన గుణాలుగా ఓ వ్యాపారం మాత్ర‌మే కాదు ఓ వ్య‌క్తి ఎదుగుద‌ల కూడా కీలకం అని చెప్ప‌క‌నే చెప్పారు ఆనంద్ మ‌హేంద్ర.


ఎవ‌రి విష‌యంలో అయినా గౌర‌వం అన్న‌దే ముఖ్యం. ఎంత పెద్ద త‌ప్పు అయినా క్ష‌మాప‌ణ‌లు అడిగి తిరిగిపోగొట్టుకున్న గౌర‌వాన్నీ, న‌మ్మ‌కాన్నీ పొంద‌గ‌ల‌గ‌డం ముఖ్యం.ఆనంద్ మహేంద్ర కూడా అదే చేశారు.త‌నకు చెందిన మ‌హేంద్ర సంస్థ‌ల‌లో ఓ రైతుకు అవ‌మానం జ‌రిగిన విష‌యం ట్రోల్ కావ‌డంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌లో ఆనంద్ మ‌హేంద్ర ఉన్నారు.క‌ర్ణాట‌క‌, తుమకూరులో ఓ షోరూంలో కెంపెగౌడ అనే రైతును షోరూం  సిబ్బంది అవ‌మానించిన తీరు వైర‌ల్ కావ‌డంతో మ‌హేంద్ర సీన్ లోకి వ‌చ్చారు. ట్విట‌ర్ ద్వారా త‌న వివ‌ర‌ణ ఇచ్చారు.ఒక వ్య‌క్తి గౌర‌వాన్ని నిల‌బెట్ట‌డం  ఎంతో ముఖ్యం.ఆ విధంగా కాకుండా ఉల్లంఘ‌న జ‌రిగితే వెంట‌నే మేము న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటాం అంటూ మ‌హేంద్ర అండ్ మ‌హేంద్ర‌ సంస్థ అధినేత వివ‌ర‌ణ ఇచ్చి హుందాత‌నం చాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: