గుండెజబ్బుల వల్ల మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేము.. ఎందుకంటే ఉన్నట్టుండి నిద్రలో కూడా ఒకసారి గుండెపోటు వల్ల ప్రాణాలు పోయిన వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం.. అయితే మరీ ఎక్కువగా గుండెజబ్బులు అంటే పెద్ద వాళ్ళకి బాగా వయసు అయిపోయిన వారికి మాత్రమే ఎక్కువగా వస్తాయని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఒత్తిడి, అలసట, సరిగ్గా పోషకాహార లోపం తీసుకోవడం వంటి కారణాల వల్ల కూడా చిన్న చిన్న వయసులోనే చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు.

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సైతం ఈ గుండెపోటు బారిన పడుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే స్ట్రోక్  వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నా.. లక్షణాలను మనం సరిగ్గా పట్టించుకోక పోయి ఉండవచ్చు. ఇక వీటన్నిటితో పాటు సీజనల్ చేంజెస్ వల్ల కూడా అప్పుడప్పుడు గుండెపోటు వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.. కొంచెం విడ్డూరంగా అనిపించినా శీతాకాలంలోనే చాలా మంది గుండె జబ్బులకు గురి అవుతున్నారు.. చలికాలం చాలా ప్రశాంతంగా,  చల్లగా ఉంటుంది.. మనసుకి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న ఎదురైతే అప్పుడు సమాధానం కూడా అంతే వింతగా అనిపిస్తుంది..

చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటివి సోకుతాయి.. అంతే కాదు బయట వాతావరణంలో అనుకోకుండా జరిగే మార్పుల వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందట.. ఎవరికైనా సరే గుండెజబ్బు ఉందని తెలిస్తే వారు మాత్రం ఈ శీతాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.. ప్రధాన కారణాలు ఏమీ లేకపోయినా శరీరంలో టెంపరేచర్ సడన్ గా తగ్గిపోవడం బాడీ ఫిజియాలజీ వల్ల గుండె మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఫలితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.. శీతాకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అలాంటి వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: