సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పప్పులు, మసాలా, దినుసులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే మార్కెట్లో దొరికే కొన్ని రసాయన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది.. ఇప్పుడు ఈ రసాయన మందులతో పనిలేకుండా కేవలం వంటింట్లో దొరికే సహజసిద్ధ పదార్థాలతో పురుగు పట్టకుండా లేదా పట్టిన  పురుగులను తరిమికొట్టొచ్చు. ఇంట్లో బియ్యం, పప్పులు, మసాలా దినుసులు ఇలా మొదలైన ధాన్యాలను నిల్వ చేసే సంప్రదాయం మన భారతదేశంలో ఎప్పటి నుంచో వస్తున్న పాత పద్ధతి.

ముఖ్యంగా పెద్ద పెద్ద కుండల్లో ధాన్యాన్ని  నిల్వ చేసే వారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ , స్టీల్ డబ్బాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వీటిని ఈ డబ్బాలలో నిల్వ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ డబ్బాలలో నిలువ చేసేటప్పుడు కొద్దిగా తేమ తగిలినా సరే వెంటనే పురుగులు పడతాయి.. ఇక చిన్న చిన్నగా ధాన్యం మొత్తం పాడు చేస్తాయి. ఇక త్వరగా చూసుకుంటే పర్లేదు కానీ రోజుల తరబడి అలాగే ఉండిపోతే ఇక ధాన్యపు గింజలు కాస్తా పిండి రూపంలో పాడుచేయడం గమనార్హం..

వంటింట్లో దొరికే వీటిని పురుగు పట్టకుండా ఉండాలంటే కేవలం సహజ సిద్ధ పదార్థాలతోనే పురుగులను దూరం చేసుకోవచ్చు.

1. వేపాకులు:
ఇంట్లో గింజలు, బియ్యం, మసాలా దినుసులు, పొడులు వంటివి పురుగు పడుతున్నట్లు అయితే ముందుగా నిల్వచేసే డబ్బాలో ను శుభ్రం చేయాలి. ఎండలో ఆరబెట్టిన తరువాత డబ్బాలలో వేప ఆకులు కూడా వేయాలి. ఇక ధాన్యం లో వేపాకులు వేసి నిల్వ చేయడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి . అలాగే ఒకవేళ అప్పటికే పురుగులు ఉంటే అవి కూడా చనిపోతాయి.

2. ఎండుమిర్చి:
ఇక మీరు నిల్వ చేయాలనుకున్న పిండిలో ఎర్ర మిరపకాయలను కలిపితే కీటకాలు, పురుగులు పట్టవు. అయితే ఎండు మిరపకాయలను చిన్నచిన్న ఫ్లేక్స్ లాగ చేసి పిండి లో మధ్య మధ్యలో కలపడం వల్ల పురుగులు పట్టే అవకాశం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: