వేసవికాలంలో ఈ వేడి వాతావరణంలో ప్రతి ఒక్కరికి చెమట, దుమ్ము, ధూళి కారణంగా తల వెంట్రుకలు చాలా మురికిగా మారుతూ ఉంటాయి. దీని ఫలితంగా జుట్టు సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది షాంపూతో స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో మరింత ఎక్కువగా జుట్టు ఊడే సమస్య ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి వాటి నుండి కాస్త విముక్తి పొందాలంటే ఈ హోం రిమెడీస్ ను పాటించండి. దీనివల్ల జుట్టు సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.

1). కొబ్బరి నూనె లో కాస్త కరివేపాకును వేసి బాగా ఉడకబెట్టి చల్లారిన తరువాత సీసాలో పోసుకుని వాటిని భద్రపరుచుకుని.. ఆ తరువాత వారానికి మూడు సార్లు అయినా ఈ నూనెను తలకు పట్టించుకోవాలి.

2). ఉల్లిపాయ రసం వచ్చేవరకు దంచి ఆ రసాన్ని తలకు పట్టించి 30 నిమిషాలపాటు తలను ఆరబెట్టి ఆ తర్వాత షాంపూతో స్నానం చేస్తే మంచిది.

3). తాజా ఉసిరి రసాన్ని తలకు పట్టించుకుని.. ఆ తరువాత కాసేపు ఆరబెట్టుకుని తలస్నానం చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది.

4). గ్రీన్ టీ పొడిని కాస్త గోరువెచ్చని నీటిలో నానబెట్టి.. ఆ నీటిని తలకు పట్టించుకుని సున్నితంగా మసాజ్ చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

5). కొన్ని మెంతులను రాత్రి సమయాల్లో నానబెట్టి మరుసటి రోజున ఆ మెంతులను బాగా నూరి తలకు పట్టించి ఉన్నట్లయితే.. మీ జుట్టు ఆరిన తరువాత షాంపూతో తలస్నానం చేస్తే.. జుట్టు సమస్య నుండి విముక్తి పొందవచ్చు ఇక మీరు కూడా తలస్నానం చేసే టప్పుడు తప్ప కుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే జుట్టు సంబంధిత సమస్య లు దూరం అవుతాయి.
 అంతే కాదు ఈ వేసవి కాలంలో మీ జుట్టును మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: