వాతావరణంలో ఉండే అధిక తేమ కారణం వల్ల తల పై ఎక్కువగా చుండ్రు ఏర్పడుతూ ఉంటుంది. ఈ చిన్న సమస్య కేవలం తలపైన కాదు కనుబొమ్మలు, భుజాల పైన కూడా ఏర్పడి చర్మాన్ని పొడిబారేలా చేస్తూ ఉంటుంది. అయితే చుండ్రు కి చెక్ పెట్టే విధంగా ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ కానీ సరైన పద్ధతులను తెలుసుకొని మాత్రమే వాటిని పాటించాల్సి ఉంటుంది. మార్కెట్లో దొరికే కొన్ని ప్రోడక్ట్ లు ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య తగ్గకపోవడం కాకుండా రెట్టింపు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఎక్కువగా అధిక ఒత్తిడి, వాతావరణంలో మార్పు, ఎయిర్ డ్రైయర్ ను విపరీతంగా వాడడం, అలర్జీ రావడం వల్ల చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి సమస్య వల్ల మన వెంట్రుకలు చాలా పలుచగా అయ్యి.. విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో చిన్న వయసులోనే బట్టతల రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా కొంతమంది నిపుణులు కొన్ని సూచనలు తెలియజేయడం జరిగింది.

1). నిమ్మరసాన్ని తలకు పట్టిం చుకోవడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందే మార్గాలలో ఇది చాలా ఉత్తమమైనదట. సాధారణమైన నూనెతో ఈ నిమ్మరసాన్ని కలిపి పట్టించుకోవడం వల్ల చాలా మంచిదట.

2). మరొకటి ఏమిటంటే కిరాణా షాపులో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూ లను ఉపయోగించి చుండ్రు ను తగ్గించుకోవచ్చు.

3). ఇక మరొకటి ఏమిటంటే పుదీనా బాగా నూరి అందులో రసాన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు మెరుగైన స్వభావాన్ని కలుగుతుందట.

4). ఇక మరొకటి ఏమిటంటే వేప హెయిర్ ఆయిల్ ను జుట్టుకు ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఇలా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు నుండి విముక్తి పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: