కరోనా వచ్చిన తర్వాత చాలామంది వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి నుండి పని చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివారు కుర్చీకే పరిమితమై పక్కకు కూడా కదలకుండా ఒకే చోట ఒకే ప్రదేశంలో స్థిరపడి పోతుంటారు. ఇక ఇలాంటి వారిని తరచుగా వెన్నునొప్పి ,మెడనొప్పి , ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా వెన్ను నొప్పి అధికంగా వస్తే మాత్రం తట్టుకోలేక పోతారు. ఇక అలాంటప్పుడు నడుం నొప్పిని దూరం చేసుకోవాలి . లేకపోతే మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. ఇక వెన్ను నొప్పిని దూరం చేసే అద్భుతమైన చిట్కాలు ఏమిటో ఒకసారి చదివి తెలుసుకుందాం.

కర్పూరాన్ని కొబ్బరినూనెలో వేసి సన్నని మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు ఈ నూనెను సీసాల్లో పోసి భద్రపరచుకోవాలి. ఇక నిద్రించడానికి రెండు నిమిషాల ముందు నొప్పి ఉన్న ప్రదేశంలో నూనెతో మసాజ్ చేసి నిద్రించాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ నూనెతో వెన్ను నొప్పి దగ్గర మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

బకెట్ గోరువెచ్చని నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి తలస్నానం చేస్తే వెన్నునొప్పి మాత్రమే కాదు. బాడీపెయిన్స్ కూడా దూరమవుతాయి. ఒకవేళ మీకు వేడినీటిని పోసుకునే అలవాటుంటే బకెట్ నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ల యూకలిప్టస్ ఆయిల్ వేసి స్నానం చేస్తే.. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా రిఫ్రెష్ గా అనిపిస్తుంది.

వెన్ను నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఒక సంచిలో వేడి నీటిని పోసి వెన్ను నొప్పి ఉన్న చోట హీట్ బ్యాగు పెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వెన్నునొప్పి ఉన్నవారు ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఆవాల నూనెతో వెన్ను నొప్పి ఉన్న చోట మసాజ్ చేసి ఆ తర్వాత తలస్నానం చేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు పాలలో పసుపు , తేనె కలుపుకుని తాగినా కూడా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: