ఒకప్పుడు పెళ్లికి సంబందించిన ఆచార వ్యవహారాలతో పోలిస్తే ఇపుడు చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి. అప్పట్లో పెళ్లి కొడుకుని పెళ్లి అయ్యేంత వరకు కూడా పెళ్లి కూతురు కనీసం కన్ను ఎత్తయినా చూసే వీలుండేది కాదు. పెద్దలు చెప్పినట్లు విని తలొంచి తాళి కట్టించుకునే వారు. అయితే ఇపుడు కాలం బాగా మారిపోయింది. పెళ్లి కొడుకుని చూసి, అంతా నచ్చితేనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొందరు అయితే డేటింగ్ చేసి తమకి సెట్ అవుతారు అనుకుంటే కానీ పెళ్లి చేసుకునే వారు కాదు. అంతేనా...ఒకప్పట్లో భర్త మాటే వేదం, అతడు ఏమి చెబితే భార్య వాటిని తూచ తప్పకుండా పాటించేవారు , అలాంటిది ఇపుడు తమ ఇష్టా అయిష్టాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

అలాగే అప్పట్లో భర్తను 'ఏమండీ' వంటి పిలుపులతో మర్యాద పూర్వకంగా సంబోధించే వారు, భర్తను భార్య పేరు పెట్టి పిలవడం అంటే మహా పాపంగా, అతనికి ఆయుష్ క్షీణం అని భావించే వారు... అలాంటిది ఇపుడు చాలా మంది భర్త ను పేరు పెట్టి పిలవడం ట్రెండ్ అయిపోయింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు, ఒకే దగ్గర కలిసి పెరిగిన వంటి వారయితే ఏకంగా అరేయ్, ఒరేయ్ అంటూ పిలిచేస్తున్నారు. అయితే భర్తను నిజంగా పేరు పెట్టి పిలవ కూడదా, అల చేస్తే భర్తకు ఆయుష్ తగ్గుతుందా అంటే..!! భర్త.. భార్య కన్న  పెద్దవాడు, అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దవారిని చిన్నవాళ్ళు పేరు పెట్టి పిలవకూడదు.

అలా పిలవడం వలన వారికి ఆయుష్ తగ్గుతుందని అంటుంటారు. అందుకనే పేరు పెట్టి పిలవరు. అలాగే పెద్దవారిని గౌరవించడం అనేది మన సంప్రదాయం కూడా. అలాగే భార్య భర్త కంటే చిన్నది కాబట్టి భర్తను పేరు పెట్టి పిలవకూడదు. ఏకాంత సమయంలో ఎలా పిలుచుకున్న నలుగురిలో మాత్రం పేరు పెట్టి పిలవడం, అరేయ్, ఒరేయ్ అనడం వంటివి చేయరాదు. ముఖ్యంగా అత్తింటి వారి ముందు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే...రేపు మీ అబ్బాయికి పెళ్లయ్యాక మీ కోడలు మీ కొడుకుని పేరు పెట్టి పిలిస్తే ఎంత బాధగా, అసౌకర్యంగా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తే అలా పిలవరు. ఇక మన హిందూ సాంప్రదాయంలో ఇంటి యజమాని అయిన భర్తకు భార్య అన్ని రకాల గౌరవ మర్యాదలను అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: