అందంగా ప్రతి ఒక్కరు కనిపించాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క పళ్ళు కూడా చాలా అందంగా కనిపించాలి. అయితే ఇలా దంతాలు తెల్లగా కనిపించాలంటే కొన్నిటిని దూరం చేసుకోవాల్సిందే.. పొగాకు ఆరోగ్యానికి చాలా హానికరం.. దంతాల మీద పొగాకు చెడు ప్రభావాన్ని చూపిస్తూ వుంటుంది. దీంతో దంతాలు నల్ల గా మారడం, మరకలు ఏర్పడతాయి కాబట్టి పొగాకుకు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది.

టీ ఎక్కువగా తాగడం వల్ల దంతాలు షైనింగ్ ని మాయం చేస్తాయి.. అందుకే టీ కి  బదులుగా గ్రీన్ టీ ని ఉపయోగించడం వల్ల చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

బిజీ షెడ్యూల్ ఉన్నందువలన ప్రతిరోజు ఎక్కువ మంది బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటారు. కానీ బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దంతాలు తొందరగా పాడవుతాయి . ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా హానికరం.

మనము తినే కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు సహజమైన మెరుపును కోల్పోతాయట.. దీంతో పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇందుకు కొన్ని ఆహార పదార్థాలు కారణమట. మరి మీ దంతాలు తెల్లగా మెరవాలంటే వాటిని కాస్త దూరం పెట్టాల్సిందే.

రెడ్ వైన్ ను తాగాలి అంటే తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వీటిని చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. పరిమితిని మించి వీటిని తీసుకుంటే ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు దంతాలు కూడా దెబ్బతింటాయి. ఇందులో ఉండే ఆమ్లాలు దంతాల మెరుపు పోగొడతాయి.

దంతాలు ఎక్కువగా మెరవాలి అంటే.. ప్రతిరోజు ఉదయాన్నే వేప పుల్లలతో పళ్ళు తిక్కడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఈ వేప పుల్లలలో ఉండే రసం చేదు వల్ల కొన్ని రోగాలు కూడా దూరం చేస్తాయని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరుగుతోంది. అందుకే ఇలాంటి నియమాలు పాటిస్తే ఖచ్చితంగా దంతాలపై ఉండే మరకలు దూరం చేసుకోవడమే కాదు దంతాల మెరుపును తీర్చిదిద్దుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: