సాధారణంగా వంట గదిలో వంట చేసేటప్పుడు కచ్చితంగా మనం ఇతర పనుల్లో నిమగ్నమవుతూ ఉంటాము.  అలాంటప్పుడు టీ,  కాఫీ , పాలు లాంటివి పొంగిపోతూ బర్నర్ పై పడుతూ ఉంటాయి. అది గ్యాస్ బర్నర్ ను పాడు చేస్తుంది. ఫలితంగా గ్యాస్ బర్నర్ లోని రంధ్రాలు మూసుకుపోతే మంట రావడం కూడా తగ్గుతుంది. ఇకపోతే కొన్నిసార్లు బర్నర్ రంధ్రాలు పూర్తిగా మూసుకుపోతే గ్యాస్ అసలు బయటకు రాకపోగా మంట కూడా రాని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఇలాంటి అనుభవాలు మీరు ఎన్నో సార్లు ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా ఉండే మహిళలకు ఈ సమస్య బాగా అర్థం అవుతాయి అని చెప్పవచ్చు.

ఇక ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు కొన్ని చిట్కాలు పాటించి గ్యాస్ బర్నర్ లో పేరుకుపోయిన మురికినీ దూరం చేయడమే కాదు మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రం చేయవచ్చు. ఇక పోతే గ్యాస్ బర్నర్ లను ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

1. నిమ్మకాయ - బేకింగ్ సోడా:
ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం వాటిని క్లీనింగ్ బ్రష్ తో శుభ్రం చేయాలి. ఇక  శుభ్రమైన నీటితో 2, 3 సార్లు తోమితే పేరుకుపోయిన మురికి మొత్తం బయటకు వెళ్ళిపోయి మంట బాగా వస్తుంది.

2. వెనిగర్ - బేకింగ్ సోడా:
ముందుగా ఒక గిన్నెలో ఈ రెండు పదార్థాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇక  శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేస్తే మూసుకుపోయిన బర్నర్ రంధ్రాలను తెరచుకోబడతాయి. ఇక తరచూ మీరు ఇలాంటి చిట్కాలతో బర్నర్ రంధ్రాలను శుభ్రం చేయవచ్చు. వంట త్వరగా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: