కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అయి ఉండడం తో ఎక్కువగా అందరు ఓటిటి లో ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారు. దీంతో  తరచూ టివిని చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే తరచూ ఎక్కువగా టీవీ ముందర సమయం గడిపే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లుగా ఒక పరిశోధనలో తెలియజేయడం జరిగింది. క్రేం బ్రిడ్జ్ యూనివర్సిటీలోని హాంగ్కాంగ్ యూనివర్సిటీ లోని కొంతమంది నిపుణులు కొంతమంది పరిశోధన చేయడం వల్ల ఈ విషయం తెలిసినట్లు తెలియజేశారు.

ఇక వారు పరిశోధనలో తెలిపిన విధంగా ఇందులో ప్రతి రోజు ఒక గంట కంటే తక్కువ సమయంలో టీవీని చూసేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 11% వరకు తగ్గించవచ్చని తెలియజేశారు. అంతేకాకుండా రోజుకి నాలుగు ఐదు గంటల కంటే.. ఎక్కువ సేపు టీవీ చూసే వారికి ఎలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందో కూడా  వారు తెలియజేయడం జరిగింది.2 లేదా 3 గంటలు టీవీ చూసే వ్యక్తులలో గుండె సమస్యలు జబ్బులు వచ్చే అవకాశం 6 శాతం మాత్రమే తక్కువగా ఉందని తెలియజేయడం జరిగింది.

ఈ అధ్యయనం కోసం నిర్వాహకులు ఐదు లక్షల కంటే ఎక్కువ మంది వ్యక్తులను ఇందులో పాల్గొనేలా చేశారు. శారీరకంగా చురుకుగా ఉండడానికి బదులుగా ఎక్కువసేపు కూర్చోవడం గుండె జబ్బులు ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతుందని నిపుణులు తెలుపుతున్నారు. టీవీ చూడడం లేదా కంప్యూటర్ ను ఉపయోగించడం వల్ల చాలా మందికి గుండె పనితీరు లో ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది. ఈ విషయాన్ని పరిశోధకులు అధ్యయనం లో తెలియజేశారు. వాస్తవానికి కదలకుండా ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల శరీరానికి అంత మంచిది కాదు.. కనీసం అర్థ గంటకు ఒకసారి అయినా సరే మన శరీరాన్ని కదలించడం చాలా మేలు లేదంటే దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: