ప్రతి ఒక్కరి వయసులో పలు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల అధిక బీపీ, మధుమేహం , గుండె సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి అని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండడం సర్వసాధారణం అయిందని నిపుణులు తెలియజేస్తున్నారు . ఎక్కువగా మగవారిలోని ఇలాంటి వ్యాధులు వస్తున్నాయట. అది కూడా 40 సంవత్సరాలు నిండిన వారిలో ఇవి ఎక్కువగా గుర్తించినట్లు వైద్యులు సూచించారు. అందుచేతనే 40 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు. అయితే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. ఇక వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1). ప్రస్తుతం మధుమేహంతో బాధపడే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి వృద్ధుల నే కాకుండా చిన్న పిల్లలకి సైతం సోకుతోంది. ఒక్కొక్కసారి ఇది వంశపారంపర్యంగా కూడా వస్తూనే ఉంటుంది. అందుచేతనే బ్లడ్ షుగర్ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకుంటూ వుండాలి. ఒకవేళ ఎవరికైనా మధుమేహం ఉన్నట్లు గుర్తిస్తే.. వారి యొక్క ఆహార నియమాలు సరిగా పాటిస్తూ ఉండాలి.

2). ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 40 ఏళ్ళు పైబడిన వారిలో ఎక్కువగా రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఒత్తిడి, వృద్ధాప్యం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైనా హైబీపీతో ఇబ్బంది పడేవారు చాలా కాలం పాటు మందులు వేసుకుంటూ ఉండాలి. ఇక అంతే కాకుండా అధిక బీపీ కారణంగా గుండె పోటు, కిడ్నీలకు సమస్య ఎదురు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

3). ఒక వ్యక్తి థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్య తో బాధపడుతున్నట్లు అయితే అతని బరువు పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. థైరాయిడ్ అనేది శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందట. ముఖ్యంగా 40 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ లేదా పురుషుడు కూడా ఈ పరీక్షలు చేయించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: