పెళ్లయిన కొత్త దంపతులు సంతాన భాగ్యం కోసం ఎక్కువగా పరితపిస్తారు అని అందరికీ తెలిసిందే.ఇక పెళ్లి అయిన తర్వాత కొంచెం ఆలస్యం అయినా కూడా తనలో ఏదో లోపం ఉంది అని,  తమకు సంతాన భాగ్యం ఉందా లేదా అని చాలామంది ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇక చుట్టుపక్కలవారు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సతమతమవుతూ ఉంటారు. ఇకపోతే పిల్లలు కలగాలి అంటే భార్యాభర్తలిద్దరూ ప్రధాన పాత్ర ఉండాలి . మరి ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాలు తగినన్ని ఉండడంతోపాటు అవి ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నప్పుడే సంతాన భాగ్యానికి దారులు ఏర్పడతాయి. వీర్యకణాలు తక్కువగా ఉన్నా లేదా ఆరోగ్యంగా లేకపోయినా సరే గర్భధారణ అనేది ఒక కలగానే మిగిలి పోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవే కాకుండా గర్భధారణ జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా వీర్యకణాల నాణ్యత దెబ్బతింటుంది. తరచుగా ఆల్కహాల్ తాగే వారిలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది . దీనితో అంగస్తంభన సమస్యలు కూడా వారు ఎదుర్కోవాలి. ముఖ్యంగా వీర్య కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ము పొగాకు వల్ల వీర్యకణాల చలనశీలత dna కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక అధిక ఒత్తిడి వల్ల కూడా సంతానోత్పత్తికి ప్రమాదం వాటిల్లే ఆస్కారం కూడా లేకపోలేదు..ముఖ్యంగా అంగస్తంభన లేకపోవడం వల్ల లైంగిక వాంఛ కూడా తగ్గడం ఫలితంగా వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉండడం కూడా జరుగుతుంది.

దంపతులు ముందుగా తాము ఒత్తిడి లో ఉన్నామా లేదా అన్న విషయాన్ని పరిశీలించుకోవాలి .ఇక ఒత్తిడితో సతమతమయ్యే వాళ్ళు ఎక్కువగా యోగా, ప్రాణాయామం, నడక వంటివి చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక వీటన్నిటితో పాటు వేడినీళ్ల స్నానం చేయకూడదు . ఇక ల్యాప్ ట్యాప్ ను ఒడిలో పెట్టుకుని అసలు పని చేయకూడదు. ముఖ్యంగా అండర్ వేర్ వదులుగా ఉండేలాగా పురుషులు చూసుకోవాలి. సరైన పోషకాహారం కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: