మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళాలి అంటే కనీసం రోజుకు ఎనిమిది లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి అని వైద్యులు సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. మరి వైద్యులు చెప్పిన ఈ సలహా వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవాలి అంటే పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇక ఉదయం లేచిన వెంటనే సుమారుగా ఒక లీటరు మంచినీళ్లు తాగాలి. ఇక ప్రయోజనాలు కలగడం కోసం ఒక గంట పాటు ఏమి తినకపోవడమే మంచిది.

ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రం అవుతుంది. అలాగే పోషకాలను త్వరగా గ్రహించడానికి దోహదపడుతుంది. ఇక కొత్త రక్తం తయారవడానికి.. కండర కణాలు వృద్ధి చెందడానికి.. రక్త కణాలను శుద్ధి చేయడానికి ఉదయం తాగే నీళ్లు చాలా సహాయపడతాయి . ముఖ్యంగా శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇక అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు శరీరంలోని మలినాలు కూడా కాలకృత్యాల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఇక ఉదయాన్నే చాలామంది చాలా బద్దకంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారు ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే రోజంతా హుషారుగా ఉంటారు అని చెబుతున్నారు.

గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. పరగడుపునే మధుమేహం ఉన్న వారు నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని కూడా నియంత్రించవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. చర్మ రంగు మెరుగుపడడమే కాకుండా పేగు ఇన్ఫెక్షన్ దూరమవుతుంది. గ్యాస్ ట్రబుల్ , ఉబకాయం, ఉదర సంబంధిత సమస్యలు, రక్తపోటు, కీళ్లనొప్పులు వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: