మన శరీరం వేడిగా ఉన్నప్పుడు లేదా ఎంతో కష్టపడినప్పుడు మాత్రమే చెమటలు పట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం  ప్రతి సీజన్లో చెమటలు పడుతూనే ఉంటాయి. ఇంకొందరిలో మాత్రం చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి విషయం జరుగుతూ ఉంటుంది . ఇలా కాకుండా ఏదైనా ఆకస్మాత్తుగా చెమటలు పడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి లక్షణం అయ్యుండవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఇలా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే ఉంటుందని తెలిపారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని విషయాలను తెలుపుతున్నారు వాటి గురించి చూద్దాం.

అకస్మాత్తుగా చెమటలు పట్టడం వల్ల గుండెపోటుకు సంకేతమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఎవరికైనా గుండెపోటు సమస్య వచ్చేటప్పుడు ఆ సమయంలో ధమనులు గుండె రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయలేవు. అలాంటి సమయంలోనే గుండెకి ఎక్కువ రక్తం అవసరం అవుతుంది కాబట్టి దీంతో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో శరీర ఉష్ణోగ్రత నియంత్రలో ఉంచడానికి ఎక్కువ చెమట విడుదలవుతుందట.

మహిళలకు రాత్రిపూట విపరీతంగా చెమటలు వచ్చాయంటే అది గుండె పోటు లక్షణం కావచ్చు. రాత్రి పూట చెమటలు పట్టడం పై పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే ఇలా అన్ని పరిస్థితుల్లో ఫ్లేక్ అని పిలిచే ఒక కొవ్వు పదార్థం పేరుకుపోవడం వల్ల ఇలాంటి విధంగా సంభవిస్తుందట.

ముఖ్యంగా గుండెపోటు లక్షణాలు ఏమిటంటే చాతి నొప్పి, చేతుల్లో ఎక్కువ నొప్పి రావడం, తల తిరగడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురుక్కోవడం, వికారం లేదా అజీర్ణం వంటి సమస్యలు తలెత్తడం, మెడ దవడ లేదా వీపు పైన తీవ్రమైన ఒత్తిడి గా అనిపించడం వంటి లక్షణాలు గుండెపోటుకు సంకేతాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: