ఇటీవల కాలంలో చాలామంది కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలా కడుపులో మంట , అజీర్తి , గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక కడుపు సమస్యలు మనం నడిపిస్తున్న జీవన శైలికి ఒక బహుమతి లాంటివి. వాంతులతో పాటు గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, గుండెల్లో మంట, అతిసారం వంటి కొన్ని సాధారణ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇకపోతే చాలామంది వివిధ కారణాలవల్ల పండుగల సమయంలో ఎక్కువగా తిని ఇలాంటి కడుపు సంబంధించి సమస్యలకు గురి అవుతున్నారు.

అందుకే ఎంత రుచికరమైన ఆహారం మీ కళ్ళ ముందు ఉన్నా సరే మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇకపోతే ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి కడుపు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇక ఎసిడిటీతో మీరు బాధపడుతున్నట్లయితే కొబ్బరి నీళ్లను తాగాలి. ఉదయాన్నే నిద్ర లేచి ఈ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కడుపులో వచ్చే ఎసిడిటీ , గుండెల్లో మంట వంటి సమస్యను దూరం చేసుకోవచ్చు.అలాగే అరటిపండు,  పుచ్చకాయ,  దోసకాయలను కూడా మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల గుండెల్లో మంట కూడా తగ్గుతుంది.

ఇక మలబద్ధకం అనేది ఇటీవల కాలంలో చాలామంది ప్రజలు ఎదుర్కొని అతి సామాన్య సమస్యగా మారిపోయింది. ఇక వేసవిలో.. ఆహారంలో కొవ్వు.. ఫైబర్ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కాబట్టి రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఆయుర్వేద త్రిఫల చూర్ణం వేసుకొని తాగితే మలబద్దక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఇక ఏ సీజన్లో అయినా సరే విరివిగా దొరికే అరటి పండ్లను డయేరియాతో ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇక ఇటీవల కాలంలో ఎవరైతే లూస్ మోషన్స్ తో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు అరటిపండు తినడం ఉత్తమం. మరిన్ని కడుపు సమస్యలతో ఇబ్బంది పడేవారు పెరుగు కూడా తీసుకోవడం వల్ల ఇలాంటి కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: