కాలం తో సంబంధం లేకుండా కూరగాయలు, ఆహార పదార్ధాలు తొందరగా పాడైపోతుంటాయి. చాలా మంది వీలైనంత వరకు కూరగాయలను, తినే ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటారు. ఒక్క ఇవే కాదు.. అప్పుడప్పుడూ మనం వండిన వంటలు తిని మిగలాగా అవి పాడైపోకుండా ఫ్రిజ్‌లో పెడుతుంటాం. ఇలాంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టొచ్చా, పెట్టకూడదా అని సరైనా అవగాహన లేకుండా ఎక్కువగా ఉన్న ప్రతి ఆహార పదార్థాలను ప్రిజ్ లో దాచేస్తూ ఉంటాము.అసలు ఫ్రిజ్‌లో ఎలాంటి పదార్ధాలను ఉంచాలి.. ఎలాంటి వాటిని ఉంచకూడదు.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళదుంప- బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల.. వాటిపై తొక్కలో ఉండే తేమ అంతా పోయి పొడిబారిపోతాయి.అందువల్ల వాటిని ముక్కలుగా కట్ చేసేటప్పుడు సరిగా ముక్కలు కావు.అంతేకాకుండా  బంగాళాదుంప లో ఉండే పిండి పదార్ధం కూడా తేమను పూర్తిగా కోల్పోతుంది.ఆ పిండి పదార్థం రాను రాను మొలకలు వచ్చి విషపూరితంగా మారుతుంది.

టమాటా- ఏపదార్థాలను ఉంచినా లేకున్నా టమాటాలను మాత్రం అసలు ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.ఒకవేళ ఉంచితే వాటి మీద ఉండే పలచటి చర్మం ముడతలు పడిపోతాయి. టమాటలో ఉండే ఆక్జాలిక్  యాసిడ్  మరియు పొటాషియం తగ్గిపోతుంది.దీనివల్ల మన శరీరానికి కావాల్సినంత పోషకాలు లభించవు.

ఉల్లిపాయలు- ఉల్లిపాయలను, గార్లిక్ ను కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు . ఫ్రిజ్ లో ఉండే చల్లదనానికి ఉల్లిపాయలో సల్ఫర్ ఐస్‌లా మారుతుంది . ఉల్లిపొరలు కూడా కుచించుకు పోతాయి.ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదు అంటారు. కానీ ఉల్లిపాయలను ప్రిజ్ లో పెడితే ఇందులో వున్న పోషకాల విలువ దెబ్బతింటుంది.

పుచ్చకాయ- పుచ్చకాయలను కోసిన ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా ముక్కలుగా ఉంచితే పుచ్చకాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లన్నీ తగ్గిపోతాయి. దీనితో తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ చప్పగా మరియు నీటి శాతం తగ్గిపోతుంది.మనం దానిని తిన్న మన శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు.
మిగిలిన కూరలను, పచ్చళ్ళను ప్రిజ్ లో స్టోర్ చేసుకొని మరీ తింటుంటారు. ఇలా చేయడం వల్ల రెండు మూడు రోజుల తరువాత క్రమంగా విషపూరితంగా మారుతుంటాయి.పాలను నిల్వ ఉంచుకోవాల్సి వస్తే మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. లేకుంటే పాలు ప్రిడ్జ్ లో ఉన్న ఆహార పదార్థాల వాసనా, జేమ్స్ ని గ్రహించి క్రమంగా విశపూరితంగా మారుతాయి.

వీటితో పాటు తేనే, బ్రెడ్, బటర్ అరటికాయలు,గుమ్మడికాయ, పుల్లని పండ్లు,మునగాకు లేదా మునగకాయలు చిల్లీ హాట్ సాస్ వంటి ఆహారపదార్ధాలను కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచరాదు.

 క్రీమ్ బిస్కెట్లు, చాకోలెట్స్, కంటి, చెవి డ్రాప్స్, రకరకాల పండ్లు, ఆకు కూరలు,పచ్చి కొబ్బరి , పెరుగు, కొబ్బరి నీళ్లు లాంటివి మూత ఉన్న బాక్స్ లో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వవుంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: