ఈ చిట్కా కోసం కావలసిన పదార్థాలు చిన్న సొంటి ముక్క ఒకటి.. కొన్ని మిరియాలను మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ..ఒక గ్లాస్ నీటిని పోసి అందులో ఒక టేబుల్ స్పూన్ టీ పొడి, ఒక టేబుల్ స్పూన్ పంచదార అలాగే రెడీ చేసి పెట్టుకున్న మిరియాల, సొంటి ముక్కల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలను పోసి మరొక ఐదు నిమిషాలు మరిగించాలి. ఇక తర్వాత వడకట్టి తాగడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వెంటనే తలనొప్పి, జలుబు , దగ్గు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇకపోతే సొంటిలో మనకు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా సోడియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్ , ఫోలేట్ ఆమ్లం , కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, విటమిన్ ఏ , విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా వంటింట్లో సహజసిద్ధంగా లభించే వాటితోనే మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించి ఇలాంటివి తయారు చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.