పిల్లలు ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్  , టీవీ లకు అలవాటు పడి సరిగా నిద్రపోవడం లేదు. అయితే ఇలా తక్కువగా నిద్ర పోవడం వల్ల.. ప్రతిరోజూ మెదడులో కొన్ని వ్యర్ధ కణాలు పెరుగుతాయని, నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని కొన్ని అధ్యాయనాలు నిరూపించాయి.అందుకే సరిపడ నిద్ర లేకపోతే ఆ వ్యర్ధ కణాలు మెదడులో పేరుకుపోతాయని, ఆ పరిస్థితి అలానే కొనసాగితే మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందట.

ఎక్కువ నిద్ర దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. కానీ అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆ అధ్యయనంలో 1నుండి 5 సంవత్సరాల వయస్సు పిల్లలు రోజుకు 9 గంటల కంటే తక్కువ నిద్రపోతే వారి జ్ఞాపకశక్తి, తెలివితేటలకు మూలమైన మెదడు ప్రాంతంలో అధిక మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తారు . పిల్లల నిద్రలో కలిగే మార్పులు వల్ల రానురాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. తక్కువ నిద్రపోయేవారిలో నిరాశ,నిస్సత్తువా, భయం,ప్రవర్తనల్లో మార్పులు కనిపిస్తాయిని ANI నివేదించింది.

ఇక, నిద్ర లేకపోవడం అనేది నిర్ణయం తీసుకోలేకపోవడం, సమస్యను పరిష్కరించ లేకపోవడం, జ్ఞాపకశక్తి  కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.రాత్రి వేళల్లో తొమ్మిది గంటల కంటే తక్కువ నిద్రపోయే పిల్లలు, మెదడులోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ బూడిద పదార్థం, లేదంటే అది చిన్న పరిమాణంలో మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. ఇక, ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లతో శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నిరోధక నియంత్రణ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంటారని తెలిపారు. తగినంత నిద్ర లేని వారికి దీర్ఘకాలిక హానిని సూచిస్తుందని పరిశోదనలు తెలిపాయి.

ఏడు గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారికన్నా, తక్కువ నిద్రపోయేవారికి జలుబు త్వరగా వస్తుందని ఓ అధ్యయనం నిరూపించింది. తక్కువ నిద్రపోయేవారిలో ఆకలి కలిగేలా చేసే హార్మోన్ గ్రెలిన్ ఎక్కువగా విడుదలయ్యి ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని, కడుపు నిండిందనే భావన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలయ్యి మరింత ఆహారం తినేవిధంగా చేసి అధిక బరువుకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: