తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం.. జీవనశైలిలో మార్పులు.. ఒకేచోట కూర్చొని పని చేయడం.. శరీరానికి శ్రమ లేకపోవడం.. ఇలా పలు కారణాలు వల్ల చిన్న వయసుకే డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో వందలో 70 శాతం మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు అని ఒక నివేదిక వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే డయాబెటిస్ సమస్య ఎంత తీవ్రతరంగా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే డయాబెటిస్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మరీ మంచిది అని వైద్యులు చెబుతున్నారు. లేకపోతే డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య.. క్రమంగా మన శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తూ చివరికి ప్రాణాంతకంగా మారుతుంది.

ఇకపోతే డయాబెటిస్ రోగులు డయాబెటిస్ సమస్యను పూర్తిగా తగ్గించుకోలేరు. కానీ అదుపులో ఉంచుకోవచ్చు. అలా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ సమస్య నుంచి కొంతవరకు విముక్తి పొందుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా తృణ ధాన్యాలు , ఉడికించిన గుడ్లు, మిల్లెట్ దోస, కలబంద జ్యూస్, బ్లాక్ గ్రామ్స్ వంటివి తప్పకుండా తీసుకోవాలి.ఇక ప్రతిరోజు అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం అన్నానికి బదులుగా రాగి పిండితో తయారు చేసిన దోసలను కూడా తినవచ్చు.

ఇక అంతే కాదు మొలకెత్తించిన తృణ ధాన్యాలు తినడం వల్ల విటమిన్ లు ,ఖనిజాలు , ప్రోటీన్లు శరీరానికి తగిన నిష్పత్తిలో లభిస్తాయి. ఇక డయాబెటిస్ బాధితులకు బ్లాక్ గ్రామ్స్ మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని చెప్పాలి. ఇక రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆహారంలో తీసుకుంటే చక్కర వ్యాధి నియంత్రణలో ఉంటుందని వైద్యుల సైతం సలహా ఇస్తున్నారు. ఇక అలాగే క్రమం తప్పకుండా కలబందతో తయారు చేసిన జ్యూస్ ని తాగడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: