ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే బొద్దింకలు ప్రాణాంతకమైన వ్యాధులను తీసుకొస్తాయని బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి . ముఖ్యంగా డ్రైనేజీ పైపుల నుంచి బొద్దింకలు బాత్రూంలోకి వస్తూ ఉంటాయి. అంతేకాదు బొద్దింకలు సింకుల ద్వారా కిచెన్ లోకి వచ్చి కిచెన్ లో ఉండే పాత్రలను, ఆహార పదార్థాలను కలుషితం చేస్తూ ఉంటాయి. నిజానికి కొంతమంది బొద్దింకలను చూస్తే భయపడుతూ ఉంటారు. మరి కొంతమంది వాటిని చంపేస్తారు లేదా తరిమేస్తారు. ఇక ఏం చేసినా సరే బొద్దింకల బెడద మాత్రం తగ్గకపోతే బొద్దింకలను నివారించడానికి మార్కెట్లో అనేక పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. కానీ వీటివల్ల బొద్దింకలు చనిపోతాయో లేదో చెప్పలేము కానీ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, మరికొన్ని ఇతర తెలియని సమస్యలు వస్తూ ఉంటాయి.

అందుకే మనుషులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా వంటింట్లో దొరికే సహజ ఉత్పత్తులను ఉపయోగించే బొద్దింకలను ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

బొద్దింకలను తరిమికొట్టడంలో బిర్యానీ ఆకులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అని అనిపిస్తుందో అక్కడ బిర్యాని ఆకులను పౌడర్ గా చేసి ఆకుల పౌడర్ ను అక్కడ చల్లాలి. ఇక ఆ వాసనకు బొద్దింకలు పారిపోతాయి.

ఇక లవంగాలు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇక లవంగాలను కిచెన్ లోని మూలల్లో ,అల్మారాలలో, సెల్ఫులలో కూడా ఉంచడం వల్ల దీని వాసన భరించలేక బొద్దింకలు దూరం అవుతాయి. లవంగాల నుంచి ఘాటువాసన తగ్గిన తర్వాత వెంటనే వాటిని మార్చి వాటి ప్లేస్ లో కొత్త లవంగాలు పెట్టడం వల్ల బొద్దింకలు కనపడకుండా పోతాయి.

అలాగే బోరిక్ పౌడర్ కూడా బొద్దింకలని నాశనం చేయడంలో సహాయపడుతుంది . ముఖ్యంగా పంచదారతో సమాన మోతాదులో కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో చల్లడం వల్ల బొద్దింకలు కనిపించకుండా పోతాయి. అలాగే వేప నూనె కూడా బొద్దింకలను దూరం చేయడానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: