ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మంది నల్లటి వలయాలు, ముడతలు, కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఎక్కువ ఒత్తిడి, నిద్రలేకపోవడం లాంటి కారణాలవల్ల ఇలా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. ఇక ఎంత అందంగా ఉన్నా సరే వీటివల్ల అంద విహీనంగా మారిపోతారు.. అమ్మాయిలు అలాగే అబ్బాయిలు కూడా. ఇకపోతే ఇటీవల కొంతమంది నిపుణులు తెలియజేసిన వివరాల మేరకు సరైన పోషకాహారం లేకపోవడం కూడా క్యారీ బ్యాగులు వస్తాయని నిరూపించారు. ఇకపోతే అతినిద్ర , కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, టీవీ అలాగే సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇలా కళ్ళకింద వలయాలు వస్తాయట.


ముఖ్యంగా అధిక ఒత్తిడి కూడా కళ్ళ కింద వలయాలకు కారణమవుతుంది. ఇక వీటివల్ల చర్మం లో ఉండే కణజాలం దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతేకాదు చాలాసేపు సూర్యరశ్మి తగిలేలా ఉంటే అది మెలనిన్ అనే వర్ణకం ఎక్కువగా శ్రవించడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అందుకే రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలి అలా నిద్రపోవడంతో కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు .ఒకవేళ వంటింటి చిట్కాల ద్వారా ఏదైనా ఫలితం ఉందా అంటే నిజంగా అవును అనే చెప్పాలి.వంటింట్లో ఉండే పాలు,  పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు సుతి మెత్తగా మర్దన చేసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే ఇలా కొద్ది రోజులు పాటించారంటే చాలు కళ్ల కింద నల్లటి వలయాలు దూరం అవుతాయి.


అంతేకాదు బాదం, కొబ్బరినూనె బాగా మిక్స్ చేసి సుతిమెత్తగా కంటి కింద మర్దన చేయడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. ఆవునెయ్యి రాసుకుంటే మరీ మంచిది. ఇక పిస్తా బాదం లాంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇటువంటి కళ్ళ కింద వలయాలు దూరం అవుతాయి .ఇక ఆకుకూరలు,  పచ్చి కూరగాయలు కూడా కళ్ళ కింద నల్లని వలయాలు దూరం చేయడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: