సాధారణంగా మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అని గుర్తించుకోవాలి. అందుకే ఆహారం విషయంలో సరైన జాగ్రత్త ఉండాలి. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే రాత్రి 7 గంటల తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. పోషకాహారంతోనే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మన ఆరోగ్యం బాగుండాలనుకుంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం రాత్రిపూట తేలిక పాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలా అయితేనే మన జీర్ణక్రియ బాగుంటుంది.

ముఖ్యంగా బిర్యానీ వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఏడు గంటల తర్వాత ఇలాంటి చికెన్ ,మటన్ బిర్యానీలను అస్సలు తినకూడదు. ఇది ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. ఇక వీటిలో కొవ్వు క్యాలరీలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి . కాబట్టి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అంతేకాదు రాత్రి సమయంలో వీటిని తినడం వల్ల సరిగ్గా జీర్ణం కాక మరెన్నో సమస్యలను ఎదుర్కోవాలి.

అలాగే ఇండియన్ ఫుడ్ లో మసాలా దినుసులను ఎక్కువగా ఉంటాయి అలా మసాలా దినుసులు లేకుండా ఉండే వంటలను తీసుకునే ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా నూనె నెయ్యితో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి లేకపోతే గుండె సమస్యలు మరియు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు కూడా తినకూడదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని మరింత భంగం చేస్తాయి. ఇక అలాగే పకోడీ లాంటివి కూడా తినకపోవడం మంచిది రాత్రిపూట కాఫీ తాగడానికి కూడా నివారించాలి. ఇలా కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి సమయంలో తినకపోవడమే మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: