సాధారణంగా ప్రతి ఇంటిలో డయాబెటిస్ వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాలి. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ఇలా డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఉండడం గమనార్హం. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, కుటుంబ చరిత్ర, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పోషకాలు లేని ఆహారం తదితర కారణాల వల్ల చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉందని వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. కేవలం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చట. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


డయాబెటిస్ రోగులు ప్రతిరోజు 2 వాల్నట్ గింజలను తినాలట . ఇక ఇలా రోజు వాల్నట్ తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఫైబర్ , మినరల్స్,  విటమిన్స్, ప్రోటీన్స్ , ఆరోగ్యకరమైన కొవ్వులు  వాల్ నట్స్ లో అధికంగా ఉంటాయి ఇక ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. ఇకపోతే డయాబెటిస్ వారు అనారోగ్యకరమైన జీవనశైలిని దూరం చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం కారణంగా మధుమేహం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫైబర్ , విటమిన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.


 ప్రతిరోజు రెండు నానబెట్టిన వాల్నట్ తినడం వల్ల డయాబెటిస్ ను అదుపు చేయవచ్చు. ఇక అంతే కాదు ఎటువంటి ఆహారంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో తెలుసుకొని మరి వాటిని తినడం ఉత్తమమైన పని. ఇంకా కేవలం వాల్నట్ మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండే గింజలను తినడం వల్ల కూడా డయాబెటిస్ లో అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించారంటే డయాబెటిస్ ను అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: