టమోటాలో ఎన్నో అనేక రకాల పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మరియు టమాటా కూరలలో వేస్తే మంచి రుచినిస్తుందని టమాటా ఎక్కువగా వాడుతుంటాము. అలాగే బ్యూటిఫుల్ గా కనిపించడానికి టమాటాను బ్యూటీ ప్రోడక్ట్ గా కూడా వాడుతుంటాము.అయితే కొన్ని సమస్యలతో బాధపడే వారు టమోటాను ఎక్కువగా తీసుకుంటే వారి సమస్య అధికం చేసుకున్నవారు అవుతారు.
 
టమోటాలో ఆక్జాలిక్ అనే ఆమ్ల గుణం ఎక్కువగా ఉండుట వలన దానిని ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్టలో అధిక గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అయి,దాని కారణంగా గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యల తో బాధపడేవారు టమోటా వాడకం తగ్గించాలి.అలాగే టమోటాలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉంటుంది కాబట్టి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
 
అందువల్ల అలెర్జీ ఉన్నవారు టమోటా తినడం వల్ల నోరు, నాలుక మరియు ముఖం వాపు, తుమ్ములు, గొంతు ఇన్ఫెక్షన్,చర్మంపై తీవ్రమైన దురద మరియు వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టమోటాలో పొటాషియం మరియు ఆక్సలేట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూత్ర పిండ సమస్యలు ఉన్నవారు చాలా తక్కువగా తినాలి లేకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వుంది
 
ఒళ్ళు నొప్పులు,కీళ్ల నొప్పులు తో బాధపడేవారు కూడా టమోటాలను తక్కువగా తినాలి.ఎందుకంటే టమోటాలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్‌ మరియు సోలనైన్ అనేది కండరాలలో కాల్షియం పేరుకుపోయి, నొప్పులు ల సమస్యకు దారితిస్తుంది.దాంతో టమోటా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు మరియు కండరాల నొప్పులు,వాపులు వచ్చే ప్రమాదం ఉంది.
 
ఈ సమస్యలతో బాధపడేవారు అవసరమైతే టమోటాను చాలా తక్కువగా తినాలి .అవసరం లేకుంటే టమోటాకి దూరంగా ఉండటమే మంచిది. టమోటాలో ఎన్ని ప్రయోజనాలు వున్నా కానీ పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోనీ, వైద్యుల సలహాలు పాటిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: