మన పూర్వీకుల నుంచి మనం ఎక్కువగా నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా శాఖాహారులు నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు... వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి లేదా ఆవకాయ, నెయ్యి ఎక్కువగా భోజనం ప్రియులు తింటూ ఉంటారు. ఇక హిందూ పురాణాలలో కూడా నెయ్యికి చాలా పవిత్రమైన పేరు ఉందని చెప్పవచ్చు. ఆహారంలోనే కాకుండా దీపాలు వెలిగించడానికి కూడా స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు భక్తులు. ఇష్ట దైవానికి సమర్పించే ఆచారం మనదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నది.

ఇకపోతే మనదేశంలో ఆహార పదార్థాల కల్తీ ఒక మాఫియాగా మారిపోయింది. ఇక ఇందులో భాగంగానే పోలీసులు కూడా చాలా మందిని అరెస్టు చేస్తున్నా.. ఈ దందా మాత్రం ఎక్కడ ఆగడం లేదని చెప్పవచ్చు. తినే ఆహారం నుంచి తాగే నీటి వరకు ప్రతి విషయంలో కూడా కల్తీ అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే మనం తీసుకునే నెయ్యి నకిలీదా లేక నిజమైనదా అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇకపోతే మీరు నెయ్యి తినడానికి ఇష్టపడితే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. ఇక కల్తీ నెయ్యి తయారు చేయడానికి చెడ్డ పదార్థాలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం..

నెయ్యి కల్తీ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఒక పాత్రలో ఒక చెంచా నెయ్యిని వేడి చేయాలి. వెంటనే కరిగి దాని రంగు గోధుమ రంగులోకి వస్తే.. అది స్వచ్ఛమైన స్థానికని ఒకవేళ పసుపు రంగులోకి మారితే అది కల్తి నెయ్యి అని గుర్తించాలి.

మరొక విధానం ఏమిటంటే చేతిలో నెయ్యి వేసుకొని తలకిందులుగా రుద్దితే నెయ్యిలో ధాన్యం ఉంటే అది నకిలీదని అర్థం చేసుకోండి. నిజమైన నెయ్యి చేతికి రాసిన వెంటనే గ్రహించబడుతుంది.

ఇక ఒక చెంచా నెయ్యిలో నాలుగు ఐదు చుక్కల అయోడిన్ కలిపితే.. రంగు నీలం రంగులోకి మారితే నెయ్యి లోపల ఉడికించిన బంగాళదుంపల మిక్సర్ ఉందని గమనించాలి. ఇలాంటి పద్ధతుల ద్వారా నెయ్యి  స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: