ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషి సగటున నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక చాలామందికి సమయం దొరకక నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా మారిపోయింది . మరి నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి  గురవుతుంది. ఇక అదే సమయంలో మన శరీరంలో 60% నీరు మాత్రమే ఉంటుంది.  కాబట్టి శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన మోతాదులో నీటిని తీసుకోవడం మంచిది. అంతేకాదు శరీరం డిహైడ్రేషన్ కి గురైనప్పుడు ఎక్కువగా చర్మం పగిలినట్టు అనిపించడం , మంటగా ఉండడం,  నీరసించి పోవడం , గొంతు ఆరిపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా అనిపిస్తాయి. ముఖ్యంగా నీళ్లు తక్కువగా తాగే వారిలో ఊబకాయ సమస్య అధికమవుతుంది.  ఇక మనం సరైన మొత్తంలో ఆహారం  తింటాము కానీ నీరు తాగలేము . కాబట్టి ఇది మన శరీరానికి ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి చాలాసార్లు నీళ్లు తాగకపోవడం వల్ల అతిగా తింటూ ఉండడం వల్ల ఊబకాయానికి దారి తీయవచ్చు.

కడుపులో నీటి శాతం తగ్గినప్పుడు మలబద్ధకం సమస్య కూడా వస్తుంది . నీరు సరిగా తాగనప్పుడు మంట , అజీర్తి, గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు నీటి కొరత ఏర్పడినప్పుడు కడుపులో యాసిడ్ ఏర్పడే వేగాన్ని కూడా పెంచుతుంది.  అంతేకాదు గుండెల్లో మంట వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. నోటి దుర్వాసన సమస్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల నోటి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది.  కాబట్టి సాధ్యమైనంత వరకు శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలి. లేకపోతే మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూశారు కదా మీకు ఎంత పని ఉన్నా సరే తప్పకుండా రోజు నాలుగు లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: