మన వంటింట్లో దొరికేటువంటి వాటిలో లవంగాలు కూడా ఒకటి. లవంగాలు ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. లవంగాలు ముఖ్యంగా కండరాల నొప్పులను చాలా త్వరగా తగ్గిస్తాయి. ఇది ఒక రోగనిరోధక శక్తి లా పనిచేస్తుంది. అంతేకాకుండా లవంగం నూనె ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం ఏదైనా ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వాటి నుంచి విముక్తి అయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడంలో వాటి జబ్బులను నయం చేయడంలో కూడా లవంగం చాలా సహాయపడుతుంది.

ఇక మన నోటిలో ఉండే దంతాల చిగుళ్ల ఇన్ఫెక్షన్లకు కారణమైన వాటిని నాశనం చేస్తుంది. మన నోటిలో ఉండే  పీరియాంటల్ ఫాథోజెన్స్ వంటి బ్యాక్టీరియా ని అంతం చేస్తుంది. ఇక అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా రాకుండా పూర్తిగా అరికడుతుంది లవంగం. ఇందులో ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందువల్ల ఎవరికైనా జలుబు,  దగ్గు వంటి ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతుంటే వాటి నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.. మన కడుపులో అపాయ వాయువు , అజీర్ణం,  మలబద్దకం,  గ్యాస్ వంటి సమస్యతో ఆకలి వేయకుండా ఇబ్బంది పడే వారికి ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

ఇక మన పూర్వం ఆయుర్వేద వైద్యులు తెలిపిన ప్రకారం లవంగాలు శరీరంలోని ఎంజైములను కూడా ప్రేరేపిస్తుందట. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ ఇంకా పేగులను కూడా ఆరోగ్యంగా కాపాడుతుంది. అందుచేతనే మన పూర్వీకులు వారంలో ఒక్కసారైనా సరే నోటిలో లవంగాలను వేసుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు బాగా అభివృద్ధి చెందడానికి ఈ లవంగాలు బాగా ఉపయోగపడతాయి. లవంగాలను వాడడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. లవంగాలు మొటిమలతో ఇబ్బంది పడేవారు లవంగాల నూనెను పట్టించుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.

లవంగాలను ఒక మోతాదులో తీసుకోవడం వల్ల ఆకలి, కడుపులో గ్యాస్, వాంతులు, వికారం , ఊపిరితిత్తుల వ్యాధులు,  దంతాల చిగుళ్ల సమస్యలు వంటివి తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా పురుషులలో లైంగిక సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తినడం వల్ల ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: