జలుబు సమస్య అనేది చాలా మందిని తెగ ఇబ్బంది పెడుతుంది. ఇక జలుబు చేసినప్పుడు సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తారు. జలుబు నివారించడానికి ఇది అద్భుతమైన మందు. విటమిన్-సి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే విటమిన్ సి లభించే నారింజ, నిమ్మకాయలు వంటి వాటిని మీ డైట్ లో తీసుకుంటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.వేడి వేడి చికెన్ సూప్ తాగితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఘాటుగా చేసుకుని ఈ చికెన్ సూప్ తీసుకోవాలి. అప్పుడు ముక్కుల్లో ఉన్న అడ్డుపడిన బ్లాక్స్ తొలగిపోతాయి. కాలే, బ్రకోలి, గ్రీన్ టీ, ఎర్ర ఉల్లిపాయలు, బ్లూ బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జలుబుతో పోరాడేందుకు సహాయపడుతుంది.జలుబు చేసినప్పుడు వేడి వేడిగా అల్లం టీ తాగితే చాలా మంచి రిలీఫ్ గా అనిపిస్తుంది. మీ గొంతుకు ఉపశమనంగా అనిపిస్తుంది. స్పైసీగా ఉండేవి జలుబు చేసినప్పుడు తీసుకుంటే ముక్కులో ఉండే బ్లాక్స్ క్లియర్ చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి వైరస్ ని నిరోధించడంలో సహాయపడతాయని అంటున్నారు.


జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్, పాలు, చీజ్ వంటివి తినకూడదని అంటారు. కానీ జలుబుని మరింత పెంచుతాయని చెప్తారు. కానీ ఐస్ క్రీమ్ తింటే అటువంటి సమస్య వస్తుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.వెల్లుల్లిలో సాధారణ జలుబుతో పోరాడగలిగే కొన్ని అంశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వెల్లుల్లి జలుబుని నివారిస్తుందనేందుకు సైంటిఫిక్ గా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇదే కాదు జలుబు వల్ల దగ్గు వచ్చిన సమయంలో లవంగం నోట్లో వేసుకుని చప్పరించమని పెద్దలు చెబుతారు. అలా చెయ్యడం వల్ల దగ్గు కంట్రోల్ అవుతుంది.జలుబు నుంచి త్వరిత ఉపశమనం పొందేందుకు మిరియాల పొడి వేసుకుని పాలు తాగడం చాలా మంచి ఎంపిక. అందులో కొద్దిగా పసుపు వేసుకుంటే ఇంకా మంచిది. వీటిలో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నందున జలుబు తగ్గడానికి గొప్ప ఔషధంగా పని చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: