బిర్యానీ ఆకులు కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నోరూరించే వంటకం ఏదైనా ఉంది అంటే అది బిర్యానీ మాత్రమే. బిర్యానీ అంటే అందులో బిర్యాని ఆకులు తప్పనిసరిగా వేయాల్సిందే. ముఖ్యంగా మాంసాహారానికి కాదు శాకాహారానికి కూడా చక్కని రుచిని , వాసనను అందిస్తాయి. అంతేకాదు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఇకపోతే ఇందులో ఎన్నో పోషకాలు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా బిర్యానీ ఆకుల ద్వారా మెగ్నీషియం, కాపర్, జింక్ , క్యాల్షియం , పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు బిర్యానీ ఆకులలో ఎక్కువగా లభిస్తాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా బిర్యానీ ఆకులను ఉపయోగించి ఆరోమాతెరపి చేయడం వల్ల శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి నుంచి కూడా విముక్తి పొందడానికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు. రాత్రి పడుకునే ముందు రెండు ఆకులను తీసుకొని దానిని కాల్చి గదిలో ఉంచడం వల్ల దానిలో నుంచి వచ్చే పొగ ఒత్తిడిని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే బిర్యానీ ఆకులను తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుందట. ముఖ్యంగా బిర్యానీ ఆకులను మరిగించి ఆ నీటిలో  కర్చీఫ్ అద్ది ఛాతిపై ఉంచితే  సమస్య దూరం అవుతుందట.

బిర్యానీ ఆకులో ఉండే ఔషధ గుణాలు గ్లూకోస్, ట్రై గ్లిజరైడ్,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా చక్కగా సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులకు బిర్యానీ ఆకులు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇక బిర్యానీ ఆకులను వంటలలో తయారు చేసుకునేటప్పుడు రుచి కోసం మాత్రమే చాలామంది వాడుతుంటారు. ఇక వీటి ప్రయోజనాలు తెలిసిన తర్వాత వీటిని ఆరోగ్యానికి  ఎన్నో  ప్రయోజనాలు కలుగుతాయి. తప్పకుండా బిర్యాని ఆకులను ఉపయోగించి అన్ని రకాల రోగాలను దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: