పైనాపిల్ రుచికి పుల్లగా,  తీయని కాంబినేషన్ తో చాలా అద్భుతంగా ఉంటుంది.  ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఈ పైనాపిల్ మంచి సువాసనను కూడా కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇక శరీరాన్ని ఆరోగ్యంగా,  ఫిట్ గా ఉంచడానికి పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం తప్పనిసరి. ఇక ఈ జ్యూస్ శరీరానికి శక్తిని అందివ్వడమే కాకుండా ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల మధుమేహంతో పాటు అధిక కొలెస్ట్రాల్ ను  కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇక పైనాపిల్ లో ఉండే పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మీకు సహాయపడతాయి.

ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఈ పైనాపిల్ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ ధమనులలో కొవ్వు పేరుకు పోవడానికి కారణం అవుతుంది. ఇది స్ట్రోక్,  గుండె పోటు,  మధుమేహం మరియు అధిక రక్తపోటుకు దారి తీస్తోంది . కాబట్టి సిట్రస్ పండ్లు కొలెస్ట్రాల్ ను  తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో పైనాపిల్ ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.  విటమిన్ సి , విటమిన్ ఏ కొలెస్ట్రాలను తగ్గించడానికి సహాయపడతాయి.  అంతేకాదు ఇందులో ఉండే విటమిన్స్,  ఫైబర్స్,  ప్రోటీన్ మూలకాలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయి.

శరీరంలో ప్రోటీన్ అదనపు కొవ్వు వ్యాప్తిని నివారిస్తుంది. ఇక దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడం మొదలవుతుంది. పైనాపిల్ జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు కారణంగా శరీరంలో రక్త ప్రసరణ గణనీయంగా తగ్గుతుంది.  దీనికి కారణం రక్తంలో గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది . కాబట్టి పైనాపిల్ లో ఉండే ఆంటీ యాక్సిడెంట్ గుణాలు రక్తంలో గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. మీరు పైనాపిల్ ను  నేరుగా తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు కానీ జ్యూస్ రూపంలో తీసుకుంటే అధిక ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: