ఇక యుక్త వయసు రాగానే అందరినీ మొటిమలు సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంకా అదొక వ్యాధిలాగా మారిపోయి చాలా సంవత్సరాలు దాకా ఎక్కువగా వచ్చేస్తాయి. అంతేగాక చీము కారడం కూడా జరుగుతుంది. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. చర్మంలో పిగ్మెంటేషన్ అధికంగా ఏర్పడటానికి కారణం మెలనిన్. ఇది అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఆ ప్రాంతం ముదురు రంగులోకి మారడం లేదా మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. ఒత్తిడి, సూర్యరశ్మి, హార్మోన్ల మార్పుల వల్ల ఇవి వస్తాయి. కలబంద మొక్కలోని రెండు రసాయనాలు అలోయిన్, అలోసిన్ పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.అలోసిన్ మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్ టైరోసినేస్ విడుదలని నిరోధించడం ద్వారా మెలనిన్ ఏర్పడటాన్ని ఆపుతుంది. కలబంద చర్మం మీద ముడతలు రాకుండా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కలబంద గుజ్జును ఉపయోగిస్తారు. కలబంద ఆకుల మధ్యలోంచి జిగటగా ఉండే గుజ్జును తీసి మొటిమలపై రాయాలి. ఇలా రోజు రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. అలాగే నిద్రపోయి మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.


ఇలా కొన్ని రోజుల పాటూ చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి.కలబందలో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడతాయి. చర్మ సౌందర్యానికే కాదు జుట్టుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కలబంద ఆకుల్లోని గుజ్జు తీసి జుట్టు కుదుళ్ళకి పెట్టుకుంటే జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్య కూడా నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు ఒత్తుగా చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది.కలబంద చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. సాధారణంగా అలోవెరా 3 దశల్లో పని చేస్తుంది. క్లెన్సింగ్ స్టేజ్, న్యూరిష్‌మెంట్ స్టేజ్, థెరప్యూటిక్ స్టేజ్ గా పని చేస్తుంది. కలబందలోని లిగ్నిన్ చర్మంలోకి చొచ్చుకుపోవడానికి సహాయపడుతుంది. సాపోనిన్ స్వీపింగ్ చర్యతో చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కలబంద చర్మం pH స్థాయిలని సమతుల్యతను చెయ్యడంలో సహకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: