1). ఆల్కహాల్ తీసుకున్నప్పుడు నూనె పదార్థాలను తీసుకోకూడదు. అయితే ఆ సమయంలో అవి తినడానికి రుచిగా అనిపించిన ఆరోగ్యాన్ని చాలా దెబ్బతినేలా చేస్తాయి. ఇవి పొట్టలో గ్యాస్ సమస్య ఏర్పడి జీర్ణ క్రియ సమస్య కూడా ఏర్పడుతుంది దీని ద్వారా గుండెకు చాలా హానికరం ఏర్పడుతుందట.
2). మద్యపానం సేవించిన తర్వాత పాలు, స్వీట్లు తినకూడదు ఇవి తిన్నట్లు అయితే శరీరంపై చాలా చేడు ప్రభావం చూపిస్తుంది. పాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పంచదార తినడం వల్ల మత్తు ఎక్కువయి కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందట. అందువలన ఆల్కహాల్ తాగిన తర్వాత ఎలాంటివి ఎక్కువగా తినాలో తెలుసుకొని జాగ్రత్త వహించాలి.
3). మద్యపానం ఎక్కువగా సేవించేవారు అందులోకి సోడా లేదా జూస్ వంటి పానియాలను కలుపుకొని తాగుతూ ఉంటారు. దీని కారణంగా ఆరోగ్యం చాలా క్షీణించవచ్చు. ఇది శరీరంలో నీటి స్థాయిని తగ్గించేలా చేస్తుంది దీంతో అనారోగ్యానికి గురి అవు తారట. అందుచేత దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత తక్కువలో వీటిని దూరం చేసుకోవాలి.
మద్యపానం అతిగా సేవించడం కూడా చాలా ప్రమాదమే అని చెప్పవచ్చు. ఇక వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.