మన శరీరంలో గుండె అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఖర్జూరం అనేది మన ఆరోగ్యానికి చక్కటి చిరునామా లాంటిది. దీన్ని చూడగానే నోట్లో వేసుకుని నమిలేయాలని అనిపిస్తుంది. అంతలా ఆకట్టుకునే ఖర్జూరాలు మినరల్స్‌, కాల్షియం, ఐరన్‌, పొటాషియం వంటి ఎన్నో పోషకాలతో నిండి ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి.వీటిలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉండి శరీరానికి తక్షణ ఎనర్జీని అందిస్తాయి. సరైన సమయంలో, సరైన రీతిలో తినడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.ఖర్జూరా పండ్లలోని ‘ఏ, బీ’ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. ఇందులోని పొటాషియం, కాల్షియం ఇంకా మెగ్నీషియం ఎముకల పటుత్వానికి బాగా దోహదపడతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు ఈ పండ్లు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం పొందవచ్చు. వీటిలోని పీచుపదార్థం ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలు దూరం చేస్తుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్‌ మొత్తాన్ని పెంచుకోవచ్చు.


గుండె వైఫల్యానికి చికిత్స చేయడంలో ఖర్జూరాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఖర్జూరాలను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకోవడం చాలా మంచిది. నిత్యం 3 ఖర్జూరాలు తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మంచి ఫలితాలు రాబట్టేందుకు వారం రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండె పోటు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ రాకుండా కాపాడుతుంది. హార్ట్‌ బీట్‌ను నార్మల్‌గా ఉంచడంలో సహకరిస్తుంది.వీటని నిత్యం తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు ఎముకలు దృఢంగా తయారవడంలో, స్పెర్మ్‌ కౌంట్‌ పెరగడంలో, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడంలో, కోలన్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడటంలో గ్రేట్‌గా పనిచేస్తాయి. ఖర్జూరంలో మాత్రమే ఉండే ఫెనాల్‌ క్లాస్‌ యాసిడ్స్‌ రోగనిరోధక శక్తి సక్రమంగా పని చేసేలా చేస్తుంది. రోజుకు 2 ఖర్జూరాలు తీసుకుంటే రక్తంలో షుగర్ 15 శాతం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.కాబట్టి ఖచ్చితంగా ఈ పండు తినండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: