నేడు మానవ జీవితం మరీ దారుణంగా మారిపోయింది. పొద్దున లేచింది మొదలు ఖర్చే, ఖర్చే.....కరెన్సీ లేనిదే కాలం అస్సలు ముందుకు కదలటం లేదు. ప్రస్తుత కాలంలో సామాన్యుడు జీవిత మనుగడ ప్రశ్నార్ధకం గా మారిపోయింది అనే చెప్పాలి. ఖర్చులు అయితే క్షణ క్షణం పెరుగుతున్నాయి. కానీ... జీతాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మనిషి సౌకర్యాలు లేకుండా బ్రతకొచ్చు... కానీ, తిండి లేకుండా బ్రతకలేరు కదా అయితే కూరగాయలు కొనాలంటే మాత్రం సామాన్యుడు కి చుక్కలు కనపడుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కూరగాయలు కొనాలంటే కరెంట్ షాక్ తగులుతోంది అలా ఉన్నాయి ధరలు మరి.

ఒక్కో కూరగాయల ధరలు కేజీ వందల్లో కనపడుతూ ప్రజల్ని భయపెడుతున్నాయి.  ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో కూరగాయల ధరలు  మండిపోతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా  కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి.  కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా  కూరగాయ పంట పొలాలు నీట మునిగి నష్టాలు రావడం తో కూరగాయల ధరలపై వాటి ప్రభావం పడింది.  టమాటాలు అయితే బంగారం ధరల కన్నా ఎక్కువగా ఉండి భయపెడుతున్నాయి.  కేజీ 10 రూపాయలు అనే టమాటాలు కాస్త వారం, పది రోజుల గ్యాప్ లోనే 50 రూపాయల మార్క్ ను దాటాయి.

ఇక మిగిలిన కూరగాయలు కూడా ఇదే బాటలో పరుగులు తీస్తున్నాయి. ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీని కంతటికీ కారణం వరుణ దేవుడే అని చెప్పాలి. అవసరం అయినప్పుడు వర్షాలు పడకుండా ఇప్పుడు పాడడం వలన అంతా నష్టాలే కలుగుతున్నాయి. అయితే ఈ ధరల ప్రభావం నుండి బయటపడలాంటే మనము ఖచ్చితంగా రోజు వారీ ఖర్చులను తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: