నిద్రలో కలలు అనేవి సాధారణంగా అందరికీ వస్తుంటాయి. నిద్రపోతున్న సమయంలో చాలా మందికి సహజంగా కలలు వస్తుంటాయి. ఆ కలలు ఎలా ఉంటాయి అంటే ఆ సంఘటనలు నిజంగా మన కళ్ల ముందే జరుగుతుందా అనేంత ప్రభావవంతంగా ఉంటుంటాయి. కొన్నిసార్లు అయితే కలలో జరిగే వాటికి ప్రతిస్పందిస్తూ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంటారు ఇలా చాలా మందికి అనుభవం అయి ఉంటుంది. మనిషి తన రోజు వారి దినచర్యలో ఎదుర్కొన్న సంఘటనలు అలాగే ఎక్కువగా ఆలోచించిన ఆలోచనలు కలల రూపంలో వస్తాయి, అని అవి ఒకరకమైన మన మెమరీ అని కొందరు శాస్త్రజ్ఞులు అంటుంటారు.

భవిష్యత్తు తెలియచేసేదే కల అని మరి కొందరు పండితులు చెబుతుంటారు. కలల రకాన్ని బట్టి ఒక్కో అర్దం ఉందని చెబుతుంటారు. అయితే మరణించిన వ్యక్తులు కనుక మన కలలోకి వచ్చినట్లయితే, అది మనం వారి గురించి ఎక్కువగా ఆలోచించడం వలన అయి ఉండొచ్చు, అలాగే మరి కొన్నిసార్లు వారు కలలోకి రావడం అనేది కొన్ని సూచనలను అందించడానికి కూడా కావొచ్చట. స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన మన కుటుంబ సభ్యులు  లేదా పెద్దలు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే వారు ఏదో బాధలో ఉన్నారని సూచన...వారి ఆత్మ శాంతి కోసం, వారికి శ్రాద్ధ కర్మలు, లేదా ఏమైనా శాంతి పూజలు చేయాలని సందేశం అట.

అంతేకాదు ఇలాంటి కలలు రావడం అనేది, మీకు ఏదైనా చెడు జరగవచ్చని కూడా వారు సూచిస్తున్నట్లు అర్థం అట.
ఒకవేళ కలలో కనుక మీరు వారితో సంభాషిస్తున్నట్లు కనిపిస్తే దానికి అర్ధం మీ జీవితంలో ఆనందం రాబోతుందని సంతోషం పెరగనుంది అని ఒక సూచన అట. చనిపోయిన మీ పూర్వీకులు కలలో సంతోషంగా కనిపిస్తే, మీకు దీర్ఘాయువు చేకూరుతుంది అని అర్థం. ఏదేమైనా కలలో మన పూర్వీకులు కనుక కనిపిస్తే వారిని తలచుకుంటూ వారి ఆత్మ శాంతి కోసం కొన్ని శాస్త్ర బద్దమైన పూజలు చేయడం మంచిది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: