భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు వారి వారి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత దేశంలోని ప్రజలందరూ కూడా పంచభూతాలను దైవంగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే పంచభూతాలను దైవంగా భావించి పూజలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  పురాతన ఆచారాల ప్రకారం ప్రతీ పని చేయడంలో కూడా కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లు ఆచారాలు ఉన్నాయి అన్న విషయం తెలుస్తుంది. ఇలాగే స్నానం చేయడం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. చాలామంది పెద్దలు నగ్నంగా స్నానం చేయకూడదు అని సూచిస్తూ ఉంటారు.


 ఇక ఈ ఆచారం రావడం వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పుడైతే ప్రతి గదికి ఒక బాత్ రూమ్, బాత్ టబ్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం స్నానాలకు ప్రత్యేకమైన గదులు ఉండేవి కాదు. దీంతో అప్పట్లో దగ్గరలో ఉన్న చెరువులు నదులు జలాశయాల దగ్గరికి వెళ్లి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అక్కడే స్నానాలు చేసేవారు. ఈ క్రమంలోనే ఒంటి  నిండా బట్టలు వేసుకుని స్నానం చేయడం చేసే వారు. ఇక చిన్న పిల్లలకు సైతం ఒంటిపై ఏదో  ఒకటి కప్పి స్నానం చేయించేవారు. అది కూడా సూర్యోదయం కు ముందే ముగించుకోవాలి.


 ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది అని ఎంతో మంది భావించేవారు. నీటిని దైవంగా భావిస్తారు భారతీయులు. అందుకే గంగా యమునా గంగోత్రి గోదావరి అని స్త్రీలా పేర్లు ఉంటాయి. నీటి ఎదుట నగ్నంగా నిలబడితే దేవతలు ఆగ్రహిస్తారు అని.  అశుభం అని పూర్వీకులు కూడా నమ్మే వారట. ఆ కారణంతో కూడా నగ్నంగా స్నానానికి దూరంగా ఉండేవారట. ఇప్పుడు మాత్రం ఆధునికయుగంలో గదికొక బాత్రూం రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా నే స్నానాలకు వెళ్తూ ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ కట్టుబాట్లు నియమాలు అన్నీ మారిపోయాయి అని చెప్పాలి. అంతేకాదండోయ్ కొన్నిచోట్ల అయితే ఆడా మగా కలిసి స్నానం చేస్తూ ఉండడం కూడా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: