తులసి ఆకులే కాదు తులసి గింజలు కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మీకు తెలుసా. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాగా తులసి గింజలు ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. తులసి గింజలను తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం చాలా వరకు తగ్గతుందని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ విత్తనాలు మనకు ఎలా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తులసి గింజలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి  ఉపయోగపడతాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు డిప్రెషన్ లేదా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే.. తులసి గింజలను ఖచ్చితంగా తినండి. ఇలా చేయడం వల్ల ఆందోళన దూరమవుతుంది.బెల్లిఫ్యాట్, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది ఓ వరం అని చెప్పాలి. ఇలాంటివారికి తులసి గింజలు దివ్యౌషధం కంటే తక్కువ కాదు.


 ఎందుకంటే వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలను తినడం వల్ల, ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. దాని కారణంగా బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.మలబద్ధకం, అసిడిటీ గ్యాస్ సమస్య ఉంటే తులసి గింజలను నీటిలో వేసి నానబెట్టాలి. అవి ఉబ్బే వరకు వేచి ఉండాలి.. ఆ తర్వాత నీటితో కలిపి వాటి తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య పూర్తి నయం అవుతుంది. ఈ నీటిని గింజలతో కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.వీటి వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఎందుకంటే ఇది అనేక అంటువ్యాధుల నుంచే కాదు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా రక్షిస్తుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తులసి అద్భుతమైన ఉపషమనంను కలిగించింది. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తులసి గింజలను కషాయం చేసి తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: