మన శరీరంలో కాలేయం అనేది ఒక ముఖ్య అవయవం. ఈ అవయవాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా జీర్ణమైన ఆహారాన్ని పంపించడంలో రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించడంలో కొవ్వు పదార్థాలను నియంత్రించడంలో అనేక విధాలుగా కాలేయం పని చేస్తూ ఉంటుంది. వాస్తవానికి ఈ అవయం ఒక్కటే 500 కంటే ఎక్కువ పనులు చేస్తుందని వైద్యులు తెలియజేయడం జరిగింది. కాలేయంలో ఎక్కువ కొవ్వు నిల్వ ఉండడం వల్ల పలు సమస్యలు ఏర్పడతాయని వైద్యులు తెలియజేస్తున్నారు అయితే ముందుగానే అలాంటి లక్షణాలను మనం గుర్తించుకునే విధంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.


1). తరచు కామెర్ల వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నప్పుడు కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించాలి.


2). ఇక అంతే కాకుండా కళ్ళు, చర్మం ఎప్పుడు పసుపు రంగులోకి మారడం కాలేయా సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి.


3). ఇక మరొకటి ఎప్పుడు పొత్తికడుపులో నొప్పి మనిషి అంత తిమ్మిరి ఎక్కడం వంటివి గుండె సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి.


4). అయితే ఎలాంటి చిన్న పని చేసిన కూడా అలసటగా అనిపించడం కూడ ఒక సమస్య నట.


సిర్రోసిన్ అనే ఫ్యాటీ లివర్ వద్ద గుండెకు పేరుకుపోయేలా చేస్తుందట. దీనివల్ల మన కాలేయం సరిగ్గా పనిచేయదని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఇది రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అంటే ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినడం.. అధికంగా బరువు పెరగడం థైరాయిడ్ సమస్యల వల్ల ఇలాంటి వీ తరచూ జరుగుతుంటాయని కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు.


మన కాలేయం ఆరోగ్యంగా ఉంచాలి అంటే ముందుగా బరువు తగ్గడం చాలా ముఖ్యమట. పండ్లు కాయగూరలు, చిరుధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె కాస్త ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం చాలా ప్రమాదం అని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: